ఎట్టకేలకు 'కాపు' రిజర్వేషన్స్: సభలోకి బిల్లు, బీసీ 'ఎఫ్' కేటగిరీలో చేర్చిన ప్రభుత్వం..
అమరావతి: 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామి ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక దాని పట్ల తాత్సారం చేస్తూ వస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.
ఎట్టకేలకు ఆ విమర్శలకు కొంతమేర చెక్ పెట్టేలా అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు శనివారం సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీలో చేరుస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. బీసీ ఎఫ్ కేటగిరీకి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు సభలో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ చిత్తశుద్ది నిరూపించుకున్నామని అన్నారు. ఇప్పటికే కాపు సంక్షేమం కోసం రూ.2100కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి స్వయం ఉపాధి కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు.
కాపు రిజర్వేషన్లలో భాగంగా.. బలిజ, వంటరి, కాపు, తెలగ కులాలను బీసీ ఎఫ్ కేటగిరీలో చేరుస్తున్నట్లు తెలిపారు. తాజా బిల్లు ద్వారా వీరందరికీ లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications