జగన్ పార్టీలో చేరడం లేదు: చంద్రబాబుకు కరణం బలరాం హెచ్చరిక

హైదరాబాద్/విజయవాడ: పార్టీ ఫిరాయిస్తున్న నేతలతో ఏనాటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆ పార్టీ సీనియర్ నేత, 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం కృష్ణమూర్తి హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గొట్టిపాటిని తెలుగుదేశంలోకి చేర్చుకోవాలంటే, తనతో సంప్రదిస్తారనే భావిస్తున్నట్టు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, దానివల్ల ఇబ్బందులనూ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చంద్రబాబునాయుడితో తనకున్న సంబంధాలు తెగిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవాలని, 30 ఏళ్లకు ముందు తామెలా ఉన్నామో, ఇప్పుడూ అలానే ఉన్నామని స్పష్టం చేశారు. ప్రత్యర్థుల నుంచి ప్రమాదం ఉందనిపించిన వేళ, కొన్నిసార్లు ముందుగానే అడుగువేయాల్సి వస్తుందన్నారు. తానెన్నడూ తప్పు చేయలేదని, తనపై అన్ని కేసులనూ కొట్టేశారని గుర్తు చేశారు.

Karanam Balaram on defections

జిల్లాలో కిడ్నాప్ అయిన వారి గురించి ప్రశ్నించగా, ఎవరో ఎక్కడో సన్యాసుల్లోకి వెళ్లి కలిస్తే, వారి సమాచారం తనకెలా తెలుస్తుందని అన్నారు. క్యాడర్‌ను నిలుపుకునేందుకు కొన్ని సార్లు పరిధులు దాటాల్సి వస్తుందని అంతమాత్రాన నేరాలు చేసినట్టు కాదని అన్నారు.

తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. భవిష్యత్తులో తన రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేనని కరణం బలరాం తెలిపారు.

టిడిపి ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు

తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పిస్తారు. సాయంత్రం జరిగే సభలో చంద్రబాబు పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఏపీలోనూ టిడిపి ఆవిర్భావ దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+