Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాడు జగన్ - నేడు సోనియా : ఈడీ విచారణ వేళ - దేవుడి స్క్రిప్టు : సోషల్ మీడియాలో ట్రోల్..!!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను ఈడీ విచారించింది. మరోసారి ఈ నెల 25న విచారణకు రావాలని నిర్దేశించింది. గత నెలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయిదు సార్లు ఇదే కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. మొత్తంగా 50 గంటలకు పైగా విచారణ సాగింది. దీని పైన దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసాయి. ఆందోళనలు నిర్వహించాయి. కానీ, ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సోనియా గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరు కావటం పైన పెద్ద ఎత్తున పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి.

ఈడీ ఎదుట సోనియా - నాడు జగన్

ఈడీ ఎదుట సోనియా - నాడు జగన్


ఇందులో ముఖ్యంగా నాడు జగన్ ఈడీ విచారించిన తీరు.. ఇప్పుడు సోనియా విచారణ ఎదుర్కోవటం పైన ఈ పోస్టింగ్స్ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. తన తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చేందుకు నాటి కాంగ్రెస్ అధినాయకత్వం అంగీకరించకపోవటంతో..జగన్ పార్టీని వీడారు. ఆ సమయంలో జగన్ పైన సీబీఐ - ఈడీ కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ లో వైఎస్సార్ పేరును ప్రస్తావించారు. నాటి నుంచి కేసుల విషయంలో న్యాయ పోరాటం..మరో వైపు రాజకీయ పోరాటంతో జగన్ సీఎం అయ్యారంటూ ఆయన అభిమానులు పోస్టింగ్స్ చేస్తున్నారు.

దేవుడి స్క్రిప్టు ఇలా రాశాడంటూ

దేవుడి స్క్రిప్టు ఇలా రాశాడంటూ

నాడు సోనియా అధికారంలో ఉండి ఏ విధంగా జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు ఈడీ -సీబీఐ విచారణలకు కారణమయ్యారో..ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వారి కారణంగా సోనియా ఈ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారంటూ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా కాలం గడిచినా.. స్థానాలు మారినా.. కర్మ వెంటాడుతూనే ఉంటుందంటూ మరి కొందరు చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సోనియా - రాహుల్ విచారణ కు హాజరయ్యే వేళ.. కేంద్రం చేతిలో ఈడీ ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని..నాడు అదే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ చేతిలో ఈడీ లేదా అనే ప్రశ్నలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ ప్రమాణ స్వీకారం..అదే విధంగా జగన్ 2019 ఎన్నికల్లో గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోలను పోస్టు చేస్తూ... పోరాడి సాధించారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాలం కరిగినా..కర్మ వెంటాడుతూనే

కాలం కరిగినా..కర్మ వెంటాడుతూనే

సోనియా గాంధీ ఈడీ విచారణ కు హాజరయ్యే సమయం నుంచి సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ నేతలతో చంద్రబాబు కలిసిన వీడియోలను సైతం పోస్టు చేసారు. వీరంతా కలిసి జగన్ పైన కేసులు నమోదు చేసారంటూ ..వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. నాడు జగన్..నేడు సోనియా ఈడీ ఎదుట.. ఇదీ దేవుడి స్క్రిప్టు.. కర్మ వెంటాడుతూనే ఉంటుందంటూ ఈ పోస్టులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+