ఏపీ సర్కార్‌ది దుర్మార్గపు చర్య : కర్నె,భజన ఆపాలన్న పొంగులేటి

హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్ 13 గేట్లు, కుడి కాల్వ నిర్వహణను తమకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ డ్యామ్‌పై ఏపీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ పంటలు ఎండబెట్టడానికే గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కరెంట్ ఉత్పత్తి నిలిపేశాడని కర్రె ప్రభాకర్ ధ్వజమెత్తారు. మానవతా దృక్పథంతోనే తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు కృష్ణా డెల్టాకు నీళ్లిస్తున్నారని అన్నారు. ఏపీ సర్కార్ ఇలానే వ్యవహరిస్తే జూరాల నుంచి నీటి చుక్క కూడా కిందకు రానివ్వమని స్పష్టం చేశారు.

టి టిడిపి నేతలు భజన ఆపాలి: పొంగులేటి

Karne and Ponguleti fires at AP govt

నాగార్జున సాగర్ డ్యామ్ 13 గేట్లు, కుడి కాల్వ నిర్వహణ తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం దురహంకార చర్య అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం జల దోపిడీకి పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.

తెలంగాణపై ఏపీ ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతుంటే తెలంగాణ తెలుగుదేశం నేతలు మౌనం వహించడం సిగ్గు చేటని అన్నారు. టీ టీడీపీ నేతలు ఏపి సిఎం చంద్రబాబు భజనను ఆపి తెలంగాణ హక్కుల కోసం ముందుకు రావాలన్నారు. లేదంటే వారికి పుట్టగతులుండవు అని అన్నారు. ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పొంగులేటి ప్రభాకర్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+