గంటా కూతురు పెళ్లి: మంత్రులు కాసు, ఏరాసు స్టెప్పులు
విశాఖపట్నం: రాష్ట్ర మంత్రులు కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డిలు సోమవారం డ్యాన్స్ చేసి అలరించారు. వారు డ్యాన్స్ చూసి సహచరులు చప్పట్లు కొట్టి ఉల్లాసంగా గడిపారు. మంత్రులిద్దరూ విశాఖపట్నంలో డ్యాన్సర్ల అవతారం ఎత్తారు.
సరదాగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి గంటా శ్రీనివాస రావు కూతురి వివాహాన్ని పురస్కరించుకుని ఏర్పాటైన సంగీత్ కార్యక్రమంలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో కాసు, ఏరాసు డాన్స్ చేసి ఔరా అనిపించారు.

అక్కినేని నాగేశ్వర రావు పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఒత్తిళ్లు, రాజకీయాలు అన్నీ పక్కనపెట్టి స్టెప్పులు వేశారు. మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి గంటా కుమార్తెతో కలిసి స్టెప్పులు వేశారు. మంత్రి ఏరాసు శాస్త్రీయ నృత్యం అభినయించారు. అక్కినేని నాగేశ్వర రావు సినిమాల్లోని పాటలకు మంత్రులు డ్యాన్స్ చేశారు. గంటా శ్రీనివాసరావు కుమార్తె వివాహం బుధవారం జరగనుంది.
కాగా, గంటా శ్రీనివాస రావు కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు వెళ్లనున్నారు. కూతురు పెళ్లి కోసం గంటా భారీ ఏర్పాట్లు చేశారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications