టికెట్ ఇవ్వలేదు: బాబుపై సినీ నటి కవిత అసంతృప్తి

రాజమండ్రి: తమ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు, సినీ నటి కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు తనను బాధించిందని ఆమె అన్నారు. 2009, 2014 ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని, పోటీ చేసేందుకు సీటు ఉందని చంద్రబాబు చెప్పారని, అయితే తనకు టికెట్ ఇవ్వలేదని ఆమె చెప్పారు. పోటీ చేసేందుకు చంద్రబాబు తనకు సీటు కేటాయించకపోవడం నిరాశానిస్పృహలకు గురి చేసిందని కవిత అన్నారు.

తూర్పు గోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం మురమళ్లలోని శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆమె తన కూతురు మాధురితో కలిసి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

Kavitha expresses dissatisfaction over Chandrababu

దివంగత నేత ఎన్టీ రామారావుపై గౌరవం, పార్టీ విధానాలపై అభిమానంతో తాను 2007 నుంచి పార్టీలో పనిచేస్తున్నానని, తనకు టికెట్ ఇవ్వకపోయినా ఐదు జిల్లాల్లో పర్యటించి పార్టీ విజయానికి కృషి చేశానని ఆమె చెప్పారు.

గతంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేసిన తనకు ప్రస్తుతం ఎటువంటి స్థానమూ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సముచిత స్థానం ఇస్తారనే నమ్మకం ఉందని, లేదంటే చంద్రబాబును అడుగుతానని ఆమె అన్నారు. రాష్ట్రం విడిపోవడం బాధాకరమని కవిత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+