కల్వకుంట్ల కవిత జోష్: హరీష్ రావు జోరు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితలో విజయానికి సంబంధించిన దరహాసం కనిపించింది. రాజకీయానుభవం అంతగా అనుభవం లేని ఆమె కాంగ్రెసు సిట్టింగ్ ఎంపి మధు యాష్కీని నిజామాబాద్ లోకసభ స్థానంలో ఓడించారు.
శనివారం తెరాస శాసనసభా సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఆ సమావేశానికి వచ్చిన ఆమె చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో పాటు పార్లమెంటు సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశానికి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు కూడా హాజరయ్యారు. సిద్ధిపేటలో ఆయన జోరు ఈ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపించింది. 93 వేలకు పైగా రికార్డు మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఇంత మెజారిటీ సాధించడానికి హరీష్ రావు చేస్తున్నదేమిటి, ప్రజలతో పెంచుకున్న అనుబంధం ఏమిటనేది అందరికీ ఆసక్తిగా మారింది.

గులాబీ మహిళలు..
ఎన్నికల్లో విజయం సాధించిన ఇతర మహిళా నేతలతో విజయ సంకేతం ఇస్తూ కల్వకుంట్ల కవిత ఇలా కనిపించారు.

హరీష్ రావు మాస్
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాస్ ఇమేజ్ ఉన్న నేత హరీష్ రావు. ఆయన సిద్ధిపేట నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనను ఇలా చుట్టుముట్టారు.

కవిత నవ్వులు..
తనను అభినందిస్తున్న నేతకు ప్రతి అభివాదం చేస్తూ కల్వకుంట్ల కవిత ఇలా కనిపించారు. ఆమె పక్కన శాసనసభకు ఎన్నికైన పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

అభివాదం చేస్తూ...
టిఆర్ఎల్పీ సమావేశానికి వచ్చిన కవిత అభివాదం చే్సతూ ఇలా కనిపించారు. ఆమె విజయానికి సంబంధించిన ఉల్లాసం చూడవచ్చు.

బాల్క సుమన్ ఇలా..
టిఆర్ఎల్పీ సమావేశానికి వివేక్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా అవతరించిన బాల్క సుమన్‌ను చూడవచ్చు. ఈటెల రాజేందర్, స్వామిగౌడ్ తదితరులు విజయ సంకేతంతో ఇలా..












Click it and Unblock the Notifications