కవిత అలక: చంద్రబాబుకు షాకిస్తారా?

తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటి కవిత త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. అందుకు ప్రధాన కారణం టీడీపీలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరుగుతోందని ఆమె భావిస్తుండటమే.

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటి కవిత త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. అందుకు ప్రధాన కారణం టీడీపీలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరుగుతోందని ఆమె భావిస్తుండటమే. ఈ మేరకు తన అనుయాయుల వద్ద ఆమె మంగళవారం ప్రస్తావించినట్టు తెలిసింది.

పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని కవిత ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరిగిందని, తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

kavitha likely to leave TDP

ఎన్టీఆర్‌ నాటి టీడీపీకి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి పోలికే లేదని ఆమె భావిస్తున్నట్టు ఆమె అనుచర వర్గాలు వెల్లడించాయి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంపైనా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహానాడులో తనను తీవ్రంగా అవమానించి కన్నీళ్లు పెట్టించారంటూ చంద్రబాబుపై అప్పట్లోనూ కవిత అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒక వేళ కవిత టీడీపీని వీడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేక కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+