శుద్దతప్పు, కేంద్రం కట్టుబడి లేదు: అధిష్టానంపై కావూరి

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శుద్దతప్పు అని సీమాంధ్ర ప్రాంత నేత, కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు శుక్రవారం ఢిల్లీలో అన్నారు. ఉభ ప్రాంతాల అంగీకారంతో రాష్ట్ర విభజన చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

రాష్ట్ర విభజనకు కేంద్రం కట్టుబడి ఉందన్నది అవాస్తవమన్నారు. అన్ని పార్టీల అంగీకారంతోనే కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన దేశానికి కూడా మంచిది కాదన్నారు. లోకసభలో నిన్నటి ఘటన చాలా దురదృష్టకరమన్నారు.

Kavuri Sambasiva Rao

విభజనకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్నారు. ఎవరికైనా పార్టీలకన్నా ప్రజలే ముఖ్యమని చెప్పారు. రాజకీయ నేతలు తమలోని కాలుష్యాన్ని వదిలేస్తే ఇఫ్పటికీ సమైక్యం సాధ్యమేనని చెప్పారు. విభజన తప్పదనుకుంటే పదేళ్ల పాటు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కొంత మేలు ఉంటుందన్నారు.

బిల్లును టేబుల్ ఐటంగా ప్రవేశ పెట్టినప్పుడే తాము మంత్రివర్గంలో వ్యతిరేకించామని చెప్పారు. విభజనకు లక్ష్యాలు, విధానాలు ఏమాత్రం కనిపించడం లేదని చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో, భద్రాచలంను సీమాంధ్రలో కలపాలని కావూరి డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+