మంత్రి పదవికి కావూరి రాజీనామా, బిజెపిలోకి వెళ్తారా?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్ పెండింగులో పెట్టినందువల్ల మనస్థాపం చెందానని, అందుకే రాజీనామా చేశానని చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
కాగా, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన కావూరి సాంబశివ రావు కాంగ్రెసు పార్టీకి కూడా త్వరలో గుడ్ బై చెప్పే అవకాశాలు లేకపోలేదంటున్నారు. త్వరలో పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించే అవకాశాలు కొట్టి పారేయలేమంటున్నారు. వాస్తవానికి పార్టీని వీడడాలని కావూరి కొద్ది రోజులనుంచి అనుకొంటున్నారు.
ప్రధాని అపాయింట్‌మెంట్ గురువారం దొరకడంతో ఆ రోజే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన భారతీయ జనతా పార్టీలో చేరవచ్చునంటున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
కావూరి కాంగ్రెసు పార్టీని వీడుతారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన కూడా పార్టీలో కొనసాగడంపై అనుమానం వ్యక్తం చేశారు. తొలుత తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన బిజెపిలో చేరనున్నట్లుగా చెబుతున్నారు. ఆయితే, ఆయన మాత్రం కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications