కాంగ్రెస్‌కు మరో కేంద్రమంత్రి షాక్: బిజెపి వైపు కావూరి!

రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చివరి దశలో విభేదించిన కావూరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే కావూరి రాకకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అభ్యంతరం లేకున్నా స్థానిక తెలుగుదేశం నాయకులు మాత్రం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేయడంతో కావూరి వెనుకకు తగ్గవలసి వచ్చింది.
ఈ పరిస్థితులలో రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే జాతీయ పార్టీ అయిన బిజెపిలో చేరడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. బిజెపిలో చేరడంపై రెండు మూడు రోజుల్లో కావూరి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి పురంధేశ్వరి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.
కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై కావూరి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరుతారని జోరుగా ఇటీవలి వరకు ప్రచారం సాగింది. అయితే, స్థానిక టిడిపి నేతలు వ్యతిరేకించారు. కావూరి కూడా టిడిపిలోకి వెళ్లనని చెప్పారు. కాంగ్రెసు నుండి పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదని భావిస్తున్న ఆయన ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తున్నారట.












Click it and Unblock the Notifications