వైసిపి లోకి కావూరి..! జగన్ తో భేటీ : ఏలూరు లోక్‌సభ బరిలోకి ..!
వైసిపి లోకి మరో సీనియర్ నేత. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కావూరు సాంబశివరావు వైసిపి లో చేర టానికి రంగం సిద్దమైంది. ఆయన ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు ఉన్న కావూరి ఇ ప్పటికే వైసిపి కీలక విజయ సాయిరెడ్డితో మంతనాలు జరిపినట్లు సమాచారం. జగన్ తో భేటీకి రంగం సిద్దమైంది. ఈ చేరిక కోసం ఆయన ఏలూరు లోక్‌సభ సీటు ఆశిస్తున్నారు.
వైసిపి లోకి కావూరి ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వైసిపి ఎంట్రీ దాదాపు ఖాయమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి అయిదు సార్లు ఎంపీగా గెలిచారు. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1984, 1989, 1994 లో కావూరి సాంబశివరావు గెలుపొందారు. ఆ తరువాత 2004 నుండి ఆయన ఏలూరు లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసారు. 2004,2009 లో ఆయన ఏలూరు లోక్‌సభ నుండి గెలిచారు. 2014 లో రాష్ట్ర విభజన కు ముందుగా ఆయనకు యూపిఏ ప్రభుత్వంలో ఆయనకు కేంద్రంలో క్యాబినెట్ పదవి దక్కింది.
అప్పటి వరకు ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉం టూనే సమైక్యాంధ్ర వాయిస్ బలంగా వినిపించారు. ఇక, రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ ను వీడి బిజెపి లో చేరారు. ప్రస్తుతం ఏపిలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన బిజెపిని వీడి వైసిపి లో చేరాలని భావిస్తున్నారు.

ఏలూరు లోక్‌సభ నుండి బరిలోకి..
వైసిపి లో చేరే అంశం పై ఆయన ఇప్పటికే జగన్ తో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. వైసిపి ముఖ్యనేత విజయ సాయి రెడ్డి తోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. అందులో ప్రధానంగా ఏలూరు లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసిపి నుండి 2014 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన తోట చంద్రశేఖర్ ప్రస్తుతం జనసేన లో ఉన్నారు. ఇక, టిడిపి నుండి మాగంటి బాబు బరిలో ఉన్నారు.
ఈ సారి టిడిపి ఎంపీగా మాగంటి బాబు పోటీ చేస్తారా..లేకే ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారా అనేది క్లారిటీ లేదు. దీంతో..ఏలూరు లో పట్టు ఉన్న కావూరి సాంబశివరావు వైసిపిలోకి వస్తే..అక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ లోక్‌సభ సీటు గెలవ చ్చనే అంచనా లో వైసిపి ఉంది. కావూరు సాంబశివరావును వైసిపిలోకి తెచ్చేందుకు దగ్గుబాటి వేంకటేశ్వరావు కీలక భూమిక పోషిస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఆయన వైసిపిలో చేరటం ఖాయమని పార్టీ నేతలు చెబుతు న్నారు. కావూరు చేరిక ద్వారా టిడిపికి అండగా నిలిచే బలమైన సామాజిక వర్గం లోని కీలక నేతలు వైసిపి వైపు ఆకర్షితు లవ్వటం ఇక రకంగా టిడిపికి నష్టంగానే భావించాలి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications