కాంగ్రెసు నుంచే పోటీ చేస్తా: కావూరి, విభజనపై వెంకయ్య
ఏలూరు/ విశాఖపట్నం: తాను కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్తథిగా ఏలూరు స్థానం నుంచే పోటీ చేస్తానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు చెప్పారు. రెండు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని ఆయన చెప్పారు. తన ఏలూరు నియోజకవర్గంలో ఆయన శనివారంనాడు పర్యటించారు.
విజయవాడ, గుంటూరు నగరాల మధ్య సీమాంధ్ర రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడుతానని ఆయన చెప్పారు.

తెలివైన కేంద్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్ర విభజన ఇంకాస్త ముందుగానే జరిగేదని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఉదయం సీఐఐ ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజించారు కానీ ఆ రాష్ట్ర ఏర్పాటుకు ఇంకా సమయం ఉందంటున్నారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలను భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అధికార వికేంద్రీకరణ జరగాలని వెంకయ్యనాయుడు అన్నారు. వచ్చే అక్టోబర్ వరకు సీమాంధ్రలో ఆర్థిక పరిస్థితి ఎలా అనేది కేంద్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా అధికార వికేంద్రీకరణ జరగాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications