టి వైపే చూస్తున్నారు: కెసిఆర్‌, బిర్లాతో భేటీ(పిక్చర్స్)

హైదరాబాద్: పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం కెసిఆర్‌తో ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిర్ల కంపెనీ ఛైర్మన్ కెసి బిర్లా సమావేశమయ్యారు. విద్యా, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. చైనా తరహాలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు అనుమతులు త్వరగా ఇచ్చేందుకు కొత్త చట్టం తీసుకొస్తామని కెసిఆర్ చెప్పారు.

ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు: నాయిని

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆడలేక మద్దెల దరువన్నట్లు ఏపి ప్రభుత్వ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. స్థానికతపై నిర్ధారించేది రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు.

గిరిజనుల కోసం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టాలే అందుకు నిదర్శనమని అన్నారు. ఏ రాష్ట్రం విద్యార్థుల ఫీజులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని అన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటున్న ఏపి ప్రభుత్వం.. తమ రాష్ట్ర విద్యార్థులకు ఫీజులు కట్టుకోలేరా అని ప్రశ్నించారు. బియాస్ బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఎందుకివ్వలేదని చంద్రబాబును ప్రశ్నించారు.

కెసిఆర్

కెసిఆర్

పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

శనివారం కెసిఆర్‌తో ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిర్ల కంపెనీ ఛైర్మన్ కెసి బిర్లా సమావేశమయ్యారు.

కెసిఆర్

కెసిఆర్

విద్యా, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

చైనా తరహాలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు అనుమతులు త్వరగా ఇచ్చేందుకు కొత్త చట్టం తీసుకొస్తామని కెసిఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందర్భంగా ఎల్లుండి(జులై 21) ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. బస్సులపై రాళ్లు రువ్వినందుకే ఓయూ విద్యార్థులై లాఠీ ఛార్జీ చేసినట్లు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో కేంద్రం వైఖరి సరికాదని అన్నారు.

ప్రజాకాంక్షకు ప్రతిరూపం: కోదండరాం

తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెల్లువెత్తిన ప్రజాకాంక్షకు ప్రభుత్వం ప్రతిరూపం ఇచ్చిందని కోదండరాం అన్నారు. శనివారం తెలంగాణ జెఏసి కోర్ కమిటీ సమావేశమైంది.

ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ముందు విద్యార్థుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. మరోవైపు పోలవరంపై తమ పోరాటం ఆగదని కోదండరాం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఫలాలు స్థానికులకే దక్కాలన్న ఆలోచనలో తప్పులేదన్నారు.

తెలంగాణకు ఎయిమ్స్: కిషన్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు శనివారం కలిశారు. అనంతరం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి తెలంగాణకు ఎయిమ్స్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పలు అంశాలపై వినతులు అందించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+