చంద్రబాబు రికార్డులను బ్రేక్ చేస్తున్న సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి తొమ్మదిళ్లు అవుతోంది. తెలంగాణ దశాబ్ది సంబురాలకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కొత్త రికార్డు కు చేరువయ్యారు. ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కొత్త విశ్లేషణ మొదలైంది. చంద్రబాబు కంటే కేసీఆర్ ఒకే రాష్ట్రానికి ఎక్కువ కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా రికార్డుల్లో నిలుస్తున్నారు.
కేసీఆర్ కొత్త రికార్డు : 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పడిన రోజు. అదే రోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పదే ఏట ప్రవేశిస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రోజులు ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు చంద్రబాబు పేరిట ఉంది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు పైనే ఈ రికార్డు ఇప్పటికీ కొనసాగుతున్నా.. ఒకే రాష్ట్రానికి అధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు మాత్రం కేసీఆర్ సొంతం కానుంది. 2014 జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్... 2023 జూన్ 2తో తొమ్మిదేండ్ల పదవీకాలాన్ని దాటనున్నారు.
చంద్రబాబే ఎక్కువ కాలం, కానీ : చంద్రబాబు మూడు విడతలు సీఎం పదవిలో ఉన్నారు. మూడు విడతల్లో మొత్తం 13 ఏండ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఏకబిగిన ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 8 ఏండ్ల 256 రోజులు మాత్రమే. ఉమ్మడి ఏపీలో 1995లో టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల తరువాత ఎన్టీఆర్ స్థానంలో సీఎం బాధ్యతలు చేపట్టారు.
1999 ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకున్నారు. 2004 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే వరకు సీఎం పదవిలో ఉన్నారు. ఈ మొత్తం కాలంలో ఎనిమిది సంవత్సరాలు 256 రోజులు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 2004, 2009 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. 2014 లో రాష్ట్ర విభజన తరువాత ఏపీ సీఎం అయ్యారు.

తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ : రాష్ట్ర విభజన తరువాత ఏపీకి చంద్రబాబు.. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు ఏపీ సీఎంగా 2014 జూన్ 8 నుంచి 2019 మే 23 వరకు కొనసాగారు. మొత్తంగా చంద్రబాబు 13 ఏళ్ల 247 రోజులు ఆ పదవిలో ఉన్నారు. మధ్యలో రాష్ట్ర విభజనతో ఆయన రికార్డును వేర్వేరుగా పరిగణలోకి తీసుకుంటున్నారు.
ఒకే తెలుగు రాష్ట్రంలో కంటిన్యూగా తొమ్మిదేళ్ల సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు. వైఎస్సార్ 2004,2009 ఎన్నికల్లో వరుసగా గెలిచినా.. 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్సార్ అయిదు సంవత్సరాలు 111 రోజులు సీఎం పదవిలో కొనసాగారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్ల 221 రోజులు ముఖ్యమంత్రిగా పని చేసారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications