Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు కేసీఆర్ షాక్!!

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏపీలోని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక అడుగు ముందుకువేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు గత ఎన్నికల్లో చీలిపోవడంవల్లే వైసీపీ గెలవగలిగిందని, ఈసారి ఆ పార్టీని ఓడించడానికి ఓటు చీలకుండా పొత్తులకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఎన్నికల సమయానికైనా తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉంది.

పవన్ కు రోడ్ మ్యాప్ ఇచ్చిన మోడీ

పవన్ కు రోడ్ మ్యాప్ ఇచ్చిన మోడీ

అధికారం కోసం వైసీపీ, టీడీపీ, జనసేన వాదులాడుకుంటుండగా కొత్తగా భారత రాష్ట్ర సమితితో మరో చిక్కొచ్చి పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండాలి.. అందరినీ ఒక కూటమిలా కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలనని జనసేనాని యోచిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీది పెద్దన్న పాత్ర. అయితే విశాఖపట్నం వచ్చిన మోడీని కలిసిన తర్వాత పవన్ పొత్తులపై సైలెంటయ్యారు. ఎన్నికల సమయంలో చూడొచ్చు.. ఇప్పుడే అంత తొందరెందుకు అని మోడీ రోడ్ మ్యాప్ ఇవ్వడంతో పవన్ నెమ్మదించారు.

ఏపీలో ఏర్పాటైన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

ఏపీలో ఏర్పాటైన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు


భారత రాష్ట్ర సమితి పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. కుల రాజకీయాలకు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో సామాజికవర్గాలను పునాదిగా చేసుకొని, గతంలో నేతలతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఆరుశాతం ఓట్లు రాబట్టాలని కేసీఆర్ యోచన. అయితే అమలులో ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కేసీఆరే కారకుడని ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది ఊహించే ప్రస్తుతానికి కర్ణాటక ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు.

 తలసానితో పార్టీ కార్యక్రమాలు..

తలసానితో పార్టీ కార్యక్రమాలు..


ఏపీకి సంబంధించి తాను అడుగుపెట్టే అవసరం లేకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోనే పార్టీ కార్యక్రమాలు నడిపించాలని నిర్ణయించారు. విజయవాడలో పార్టీ కార్యాలయం నిర్మాణమైన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పోటీపడబోతోంది. తెలుగుదేశం-జనసేన కలిసి పోటీచేసినా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీఆర్ఎస్ చీల్చబోతోందని స్పష్టమవుతోంది. ఒకరకంగా టీడీపీ, జనసేన ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది. ఆర్థికంగా బలోపేతమై ఉన్న బీఆర్ఎస్ అందుకు తగ్గట్లుగానే ఎన్నికల్లో పోటీపడితే ఈ రెండు పార్టీలకు నష్టం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+