‘మెట్రోపొలిస్’లో కెసిఆర్: వెంకయ్యకు థ్యాంక్స్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్‌లో 11వ మెట్రో పొలిస్ కాంగ్రెస్‌ను గవర్నర్ నర్సింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సదస్సుకు 400మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 9వ తేదీన సదస్సులో ప్రసంగించనున్నారు.
మంగళవారం నాటి సదస్సులో కెసిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. సంతులిత అభివృద్ధి సాధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి సాయం చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచంలోని నగరాల మధ్య అవగాహన, ప్రజల మధ్య అభిప్రాయాల మార్పిడికి మెట్రోపొలిస్ సదస్సు గొప్ప వేదిక అని అన్నారు.
అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న చారిత్రక హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. విద్య, ఉద్యోగం, వైద్యం, మెరుగైన సౌకర్యాల కోసం ప్రజలు నగరాల బాట పడుతున్నారని చెప్పారు. వలసలు పెరిగినంత వేగంగా అభివృద్ధి జరగడం లేదని, అందువల్లే మురికివాడలు ఏర్పడతున్నాయని అన్నారు.
మెట్రోపొలిస్ లాంటి సదస్సులు పరస్పర ఆలోచనల మార్పిడికి ఉపయోగపడతాయని గవర్నర్ నర్సింహన్ అన్నారు. నగరాలు ఒకప్పుడు ఉన్నత వర్గాలు, ధనికులకే పరిమితమని.. అయితే కాలంతోపాటు నగరాలు మారాయని చెప్పారు. అన్ని తరగతుల ప్రజలు నగరజీవనంలో భాగస్వాములయ్యారని చెప్పారు. మంచి నాగరికత, ఆరోగ్యవంతమైన జీవనం ఉన్న నగరాలు కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. సహజసిద్ధమైన వాతావరణంతో కూడిన నగరాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో భిన్న సంస్కృతులు మిళితమై ఉన్నాయని అన్నారు. కాలుష్య రహిత, సహజవనరుల వినియోగంతో కూడిన నగరజీవనం ఆహ్లాదాన్నిస్తుందని వివరించారు.

మెట్రోపొలిస్ సదస్సు
నగరంలోని హైటెక్స్‌లో 11వ మెట్రో పొలిస్ కాంగ్రెస్‌ను గవర్నర్ నర్సింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం అధికారికంగా ప్రారంభించారు.

మెట్రోపొలిస్ సదస్సు
ఈ సదస్సుకు 400మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 9వ తేదీన సదస్సులో ప్రసంగించనున్నారు.

మెట్రోపొలిస్ సదస్సు
మంగళవారం నాటి సదస్సులో కెసిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.

మెట్రోపొలిస్ సదస్సు
సంతులిత అభివృద్ధి సాధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి సాయం చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

మెట్రోపొలిస్ సదస్సు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచంలోని నగరాల మధ్య అవగాహన, ప్రజల మధ్య అభిప్రాయాల మార్పిడికి మెట్రోపొలిస్ సదస్సు గొప్ప వేదిక అని అన్నారు.

మెట్రోపొలిస్ సదస్సు
అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న చారిత్రక హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు.

మెట్రోపొలిస్ సదస్సు
విద్య, ఉద్యోగం, వైద్యం, మెరుగైన సౌకర్యాల కోసం ప్రజలు నగరాల బాట పడుతున్నారని చెప్పారు. వలసలు పెరిగినంత వేగంగా అభివృద్ధి జరగడం లేదని, అందువల్లే మురికివాడలు ఏర్పడతున్నాయని అన్నారు.

మెట్రోపొలిస్ సదస్సు
మెట్రోపొలిస్ లాంటి సదస్సులు పరస్పర ఆలోచనల మార్పిడికి ఉపయోగపడతాయని గవర్నర్ నర్సింహన్ అన్నారు.

మెట్రోపొలిస్ సదస్సు
నగరాలు ఒకప్పుడు ఉన్నత వర్గాలు, ధనికులకే పరిమితమని.. అయితే కాలంతోపాటు నగరాలు మారాయని చెప్పారు. అన్ని తరగతుల ప్రజలు నగరజీవనంలో భాగస్వాములయ్యారని చెప్పారు.

మెట్రోపొలిస్ సదస్సు
మంచి నాగరికత, ఆరోగ్యవంతమైన జీవనం ఉన్న నగరాలు కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. సహజసిద్ధమైన వాతావరణంతో కూడిన నగరాలు ఏర్పడాలని ఆకాంక్షించారు.

మెట్రోపొలిస్ సదస్సు
హైదరాబాద్‌లో భిన్న సంస్కృతులు మిళితమై ఉన్నాయని అన్నారు. కాలుష్య రహిత, సహజవనరుల వినియోగంతో కూడిన నగరజీవనం ఆహ్లాదాన్నిస్తుందని వివరించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications