కేసీఆర్, చంద్రబాబు, జగన్.. ముగ్గురూ ఒకే కారులో.. ఏమా కథ!!

హైదరాబాద్ : సినిమాలను రాజకీయాలను మిక్స్ చేస్తే.. ఒక్కోసారి ఆ కిక్కే వేరు! రియల్ లైఫ్ లో.. ఎంతటి అసాధ్యన్నయినా సరే రీల్ లైఫ్ లో సాధ్యమే అన్నట్టు భ్రమింపజేయవచ్చు. పొలిటికల్ గా ఆయా నేతలకు ఉండే మైలేజ్ ను సినిమా పబ్లిసిటీల కోసం వాడుకోవడం కూడా సినిమాల పట్ల జనంలో మరింత ఆసక్తిని రేకెత్తించడానికే!

KCR, CHANDRABABU, JAGAN.. three are travelling in one car!!

తాజాగా విడుదలైన సునీల్.. 'ఈడు గోల్డ్ ఎహే' ట్రైలర్ ఇందుకో ఉదాహరణ. ట్రైలర్ అంతా మామూలుగానే సాగిపోయినా.. చివర్లో మాత్రం కేసీఆర్, చంద్రబాబు, జగన్ ను ఒకే కారులో కూర్చోబెట్టి చిన్న పంచ్ వదిలారు. కూర్చోబెట్టడం అంటే.. నిజంగానే కూర్చోబెట్టడం కాదు.. సునీల్ పోసానితో చెప్పే ఓ కహానీలో.. ' కేసీఆర్, చంద్రబాబు, జగన్' ఒకే కారులో వెళతుంటారు..' అని చెబుతాడు. దీంతో సునీల్ మాటలను మధ్యలోనే అందుకున్న పోసాని.. 'ఇంకా నయం ముందు సీట్లో లోకేష్ బాబు, ఆ పక్క సీట్లో మహేశ్ బాబు ఉన్నారని చెప్పలేదు' అని ముగిస్తాడు.

మరి కేసీఆర్, చంద్రబాబు, జగన్ ల గురించి సునీల్ చెబుతోన్న కహాని ట్రైలర్ కే పరిమితమో.. లేక సినిమాలో ఎక్కడైనా ఈ ముగ్గురి ప్రస్తావన ఉందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే దాకా వేచి చూడాల్సిందే. ఏదేమైనా.. ఈ ముగ్గరు రాజకీయ నాయకుల పొలిటికల్ మైలేజ్ మాత్రం సునీల్ సినిమా ట్రైలర్ కు మాత్రం బాగానే ఉపయోగపడేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+