బాబుతో బలవంతపు దోస్తీ వెంకయ్య పనే: కెసిఆర్
హైదరాబాద్: ప్రజలను మోసం చేసేందుకే తెలుగుదేశం, బిజెపి పొత్తు పెట్టుకున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విమర్శించారు. ఐఎన్‌టియుసి నేతలతో పాటు పలు కార్మిక సంఘాల నేతలు పార్టీలో చేరిన సందర్బంగా ఆయన సోమవారం ప్రసంగించారు. తెలుగుదేశం, బిజెపిల మధ్య జబర్దస్తీ పొత్తు ఎందుకు మనం అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
పార్టీ శ్రేణులు వద్దన్నా తెలుగుదేశం, బిజెపి పొత్తు పెట్టుకున్నాయని ఆయన అన్నారు. పోలవరం డిజైన్ మార్పుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడి వైఖరి ఏమిటని ఆయన అడిగారు.

ప్రజలకు మేలు జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలని, తెలంగాణలోని కోటి ఎకరాలు పచ్చబడాలని ఆయన అన్నారు. అది పేరుకే బిజెపి అని, అదొక నాయుడి వర్గమని, చంద్రబాబు నాయుడూ వెంకయ్య నాయుడూ కలిసి మనల్ని మోసం చేయాలని చూస్తున్నారని కెసిఆర్ అన్నారు. వెంకయ్య, చంద్రబాబు ఆంద్రకు కొమ్ముకాసేవాళ్లేనని ఆయన అన్నారు.
తెలంగాణ బిజెపి నేతలు పొత్తు వద్దని మొత్తుకున్నా వెంకయ్యనాయుడు ఎందుకు దోస్తీ కట్టారని ఆయన అడిగారు. తెలంగాణలో సకల సమస్యలకు కాంగ్రెసు, తెలుగుదేశం ప్రభుత్వాలే కారణమని ఆయన అన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముమ్మాటికీ సన్నాసేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications