బాబుతో వద్దంటే, కులం పేరుపెట్టి దొర అంటారా?: కెసిఆర్

తెరాస అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణను అద్భుతంగా తీర్చి దిద్దుతానన్నారు. తనకు తెలంగాణ తెచ్చిన కీర్తి చాలని, పదవులు అనవసరమన్నారు. తెలంగాణవారికి ఆంధ్రా శక్తుల పీడ ఇంకా విరగడ కాలేదన్నారు. బిజెపి కార్యకర్తలు వద్దన్నా చంద్రబాబు బలవంతంగా పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి అన్నీ తాను నెరవేరుస్తానని, కాంగ్రెసు, టిడిపిలకు వారి హామీలపై చిత్తశుద్ధి లేదన్నారు.
ప్రజలకు మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలన్నారు. రాజకీయ అవినీతి అంతం అయితేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పారు. వంద కోట్లు సంపాదించే దుష్ట సంప్రదాయం పోవాలన్నారు. తెలంగాణ అడుగడుగునా దోపిడీకి, వివక్షకు గురయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బాగు పడాలంటే 16 ఎంపీ గెలవాలని, శాసన సభలో తెరాస ఉండాలన్నారు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం ఒకరిని చేయమనంటే ఎలా అన్నారు.
తెలంగాణ తెచ్చిన కీర్తి ముందు పదవులు తనకు లెక్క కాదన్నారు. టిడిపి, కాంగ్రెసు ప్రభుత్వాలు మనం చూడనివి కావన్నారు. తెరాస ప్రభుత్వం వస్తే కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమన్నారు. తెలంగాణలోని ఉద్యోగులు తెలంగాణలో.. సీమాంధ్రలోని ఉద్యోగులు సీమాంధ్రలో ఉండాల్సిందేనన్నారు. కాగా, కెసిఆర్ మెదక్ లోకసభ స్థానానికి సంగారెడ్డిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం గంటలకు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేస్తారు.












Click it and Unblock the Notifications