ఆంధ్రలో కెసిఆర్ ఫ్లెక్సీ: భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు
కాకినాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగులు అభినందిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ చర్యలు చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును అభినందిస్తూ తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
"తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల చీకటి జీవితాలలో వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గార్కి మా శతకోటి అభివందనములు" అని ఆ ఫ్లెక్సీపై పేర్కొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలుకు చర్యలు చేపట్టింది. అయితే, కెసిఆర్ ఫ్లెక్సీ ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు.
కెసిఆర్ ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అవమానించడంగా వారు భావిస్తున్నారు. ఆ ఫ్లెక్సీలను తొలగించాలని వారు పంచాయతీ కార్యదర్శిని కోరారు.












Click it and Unblock the Notifications