దేనికైనా నేను రెడీ, నువ్వెంత: కెసిఆర్‌కు చంద్రబాబు

KCR game for debate with Chandrababu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి సవాల్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం స్పందించారు. చర్చకు తాను సిద్ధమని కెసిఆర్ ప్రకటించగా.. ఏ అంశం పైన అయినా తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు.

వ్యక్తిగత జీవితం పైనా, అభివృద్ధి పైన, వ్యక్తిత్వం పైన... ఏ విషయమైనా తాను చర్చకు సిద్ధమన్నారు. కెసిఆర్‌లా తాను ఓ రోజు కాళ్లు, మరో రోజు జుట్టు పట్టుకునే రకం కాదన్నారు. తనలాంటి నాయకుడు లేరని, తన హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని కెసిఆరే గతంలో చెప్పారని గుర్తు చేశారు.

తాను బుల్లెట్‌లా దూసుకెళ్తానని, తానేంటో చూపిస్తానని, ఎప్పుడైనా ఎక్కడైనా దేనిపై అయినా చర్చకు రెడీ అని, కెసిఆర్ ఆర్ వస్తావా? క్యారెక్టర్, క్రమశిక్షణ, తెలంగాణ అభివృద్ధి.. దేనిపై చర్చిద్దాం? నీకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని బాబు ధ్వజమెత్తారు.

టిడిపిలో ఉండి పదవులు అనుభవించావని, నీ కంటే ఎక్కువ మాట్లాడగలమని, సభ్యత అడ్డు వస్తోందన్నారు. తాను నీతిగా పాలించానని, నిప్పులా బతికానని, తనను ఎవడూ ఏమీ చేయలేడన్నారు. సోనియా, వైయస్ కలిసి నాపై పాతిక కేసులు వేయించారని, ముప్ఫై విచారణలు జరిపారని, ఏమీ చేయలేక పోయారన్నారు. అలాంటిది నువ్వెంత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+