కవ్విస్తున్నారని కెసిఆర్ చిర్రుబుర్రు: ఫాంహౌస్ (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుర్రుగా ఉన్నారట. ఓ వైపు పార్టీ పొత్తు, విలీనం చర్చలు జరుగుతుండగానే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన తర్వాత కాంగ్రెసు అనుసరిస్తున్న విధానంపై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారు. ఢిల్లీ నుంచి బుధవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన కెసిఆర్ గురువారం మెదక్ జిల్లాలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.
అక్కడ పార్టీ ఎంపీలు వివేక్, మంద జగన్నాథం, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీశ్ రావు, కెటిఆర్, నాయిని నర్సింహా రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులతో కెసిఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పరిణామాలు, కాంగ్రెస్‌లో తెరాస విలీనం, పొత్తు, కాంగ్రెస్ వ్యవహారశైలి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

కెసిఆర్‌కు ఘన స్వాగతం
ఫాం హౌస్‌కు చేరుకున్న కెసిఆర్‌కు పలువురు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన భేటీలో కెసిఆర్ రెండు, మూడు రోజులుగా కాంగ్రెస్ నడుచుకుంటున్న తీరుపై ఆగ్రహం వెలిబుచ్చారు.

ఘన స్వాగతం
వాళ్లు పార్టీలోకి రమ్మంటున్నారని, అడిగిన వాటి గురించి మాత్రం పట్టించుకోవడం లేదని, పైగా తెరాసకు చెందిన ఎమ్మెల్యే అరవింద రెడ్డిని, ఎంపీ విజయశాంతిని చేర్చుకుని కవ్విస్తున్నారని, మనం విలీనం కావాలని కోరుకుంటున్న వారు వ్యవహరించే తీరు ఇదేనా? కాంగ్రెస్‌తో అయ్యేది ఏముంది? వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపితో సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారట.

కెసిఆర్
కాంగ్రెస్ కాదనుకుంటున్నప్పుడు బిజెపితో పోతే ఎలా ఉంటుందని, ఎన్డీయోలోకి వస్తామంటే బిజెపి అంగీకరిస్తుందని కూడా కెసిఆర్ నేతలతో అన్నారు.

ఫాం హౌస్
వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి వెళ్లాలనే ప్రతిపాదనను పార్టీ నేతలు పలువురు తోసి పుచ్చారట. తెలంగాణలో బిజెపికి సరైన బలం లేదని, గతంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పాపానికి మైనార్టీల విషయంలో టిడిపి ఇంతవరకు కోలుకోవడం లేదని చెప్పారట.

స్వాగతం
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిందనే పేరుతో పాటు, మైనార్టీల అండ కూడా ఉంటుందని, బిజెపితో వెళ్తే మైనార్టీలు దూరమవుతారని పలువురు నేతలు చెప్పారని తెలుస్తోంది.

కె చంద్రశేఖర రావు
శుక్రవారం మరోసారి సమావేశమవుదామని, అన్ని విషయాలు చర్చిద్దామని పార్టీ నేతలకు కెసిఆర్ వారితో చెప్పారట. కాంగ్రెస్‌లో తెరాస విలీనం లేదా పొత్తు ఉంటుందా? లేదా? అన్న దానిపై శుక్రవారం నాటి భేటీలో స్పష్టత వచ్చే అవకాశముందంటున్నారు.












Click it and Unblock the Notifications