జూ.ఎన్టీఆర్‌ని దూరంచేశాడు: హరీష్ సంచలనం, కేసీఆర్‌పై
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన దుమ్మెత్తి పోశారు. తన తనయుడు నారా లోకేష్‌కు అడ్డువస్తాడని హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాలకు దూరం చేశాడని తీవ్ర విమర్శలు చేశారు.
కేసీఆర్ తనకు వేలు విడిచిన మామ మాత్రమే కాదని, వేలు పట్టుకొని నడిపించిన తండ్రిలాంటి వాడు అన్నారు. తనకు పదవులు, రాజకీయాలు కేసీఆర్ పెట్టిన భిక్షనే అన్నారు. తెలంగాణ టీడీపీ నేత పదే పదే రేవంత్ రెడ్డి పదే పదే తన పైన ఆరోపణలు చేయడం సరికాదు. తన పైన పదేపదే విమర్శలు చేస్తుండటంతో తాను ఇప్పుడు స్పందిస్తున్నానని చెప్పారు.
నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగాలు చేసిన చరిత్ర తమది అన్నారు. కేసీఆర్‌కు ఆ చరిత్ర ఉందన్నారు. కానీ, చంద్రబాబు తనకు పదవి, పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచాడన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మృతికి చంద్రబాబు కారణమైన వ్యక్తి అన్నారు.

రేవంత్ రెడ్డి తన పైన పదేపదే ఆరోపణలు చేస్తే తాను సహించేది లేదన్నారు. చంద్రబాబును మెప్పించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేయవద్దన్నారు. తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తెరాస ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని, దీనిని చూసి ఓర్వలేకే వారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రేవంత్ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉంటాయన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం వెన్నుపోట్ల పైన నిర్మించబడిందన్నారు.
రేవంత్ రెడ్డిది వితండ వాదం: గణేష్
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన తెరాస ఎమ్మెల్యే గణేష్ గుప్తా మీడియా పాయింట్ వద్ద మండిపడ్డారు. కవిత ఒకేచోట సర్వేలో తన పేరును నమోదు చేయించుకున్నారని మంత్రి ఈటెల రాజేందర్ ఆధారాలు చూపించినా రేవంత్ వితండవాదం చేస్తున్నారన్నారు. రేవంత్ బడ్జెట్‌కు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. కవిత పైన చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఉపసంహరించుకోవాలన్నారు.
కాగా, అసెంబ్లీ వాయిదా పడకముందు సభలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తామని అంటుందే తప్ప చేతల్లో ఎక్కడా కనబడటం లేదంటూ ఓ పిట్ట కథను వినిపించారు. అదే సమయంలో కల్పించుకున్న కేటీఆర్ అంతే చమత్కారంగా సమధానమిచ్చారు.












Click it and Unblock the Notifications