ప్రధానికి కెసిఆర్ లేఖ: 'అవిశ్వాసంపై చిరు బాధపడ్డారు'

'చిరంజీవి బాధపడ్డారు'
సొంత పార్టీ పార్లమెంటు సభ్యులు యూపిఏ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టడంతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బాధపడ్డారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. ఎంపీలు విభజనపై ఆవేదనతోనే అలా చేసి ఉంటారని కాని, అది సరికాదన్నారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పర్యటనలో ఎలాంటి సంచలనాలు ఉండవన్నారు. బిల్లుపై అసెంబ్లీలో ఓటింగు గురించి తనకు తెలియదన్నారు.
స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నాం: టిజి వెంకటేష్
విభజనను అడ్డుకునేందుకు తమకు ఉండే ఆయుధాలను తాము ఉపయోగించుకుంటూ స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నామని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ వేరుగా చెప్పారు. పాకిస్తాన్, చైనాలతో యుద్ధం జరిగినప్పుడు కూడా ఇంత స్థాయిలో కేంద్రమంత్రుల సమావేశాలు జరగలేదని ఎద్దేవా చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు నీటి పారుదల విషయాలను సెట్ చేయలేదన్నారు. తాము విభజన జరగదనే భావించామని కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు.
జెసి పార్టీకి రాజీనామా చేయాలి: టి నేతలు
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించిన అనంతపురం జిల్లా సీనియర్ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించాలని లేదా ఆయనే రాజీనామా చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు ఆమోస్, రాంరెడ్డి దామోదర రెడ్డి తదితరులు అన్నారు.












Click it and Unblock the Notifications