కాంగ్రెసుకు దూరం: బిజెపి వైపు చూస్తున్న కెసిఆర్?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తుకు గండి పడిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు పెట్టుకునే దిశగా ఆయన కదులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరితే పొత్తుకు అభ్యంతరం లేదన్న సంకేతాలు బిజెపి, తెరాసల నుంచి వస్తున్నాయి. ఈ విషయంలో తెరాస గానీ బిజెపి గానీ బహిరంగంగా స్పందించడం లేదు. అదే సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలను తోసిపుచ్చడం లేదు.

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కొద్ది రోజులుగా బిజెపి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పరస్పరం మాట్లాడుకున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా జరిపారు. ఈ సందర్భంగా బిజెపి నుంచి 40-45 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలు కావాలనే ప్రతిపాదన వచ్చింది. కెసిఆర్ మాత్రం 20-22 అసెంబ్లీ, రెండు లోక్‌సభ (సికింద్రాబాద్, మల్కాజిగిరి) స్థానాలు ఇస్తామని చెప్పినట్లు సమాచారం.

K Chandra Sekhar Rao

ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే, తప్పక మద్దతు ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారని, చివరికి తమకు 30 అసెంబ్లీ, ఐదారు లోక్‌సభ స్థానాలు కేటాయిస్తే తెరాసతో పొత్తుకు బిజెపి నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తుపై కెసిఆర్ తమను సంప్రదించిన విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి తెలియజేసింది.

తెలుగుదేశం పార్టీతో కన్నా తెరాసతో పొత్తు పెట్టుకోవటమే నయమనే భావనలో తెలంగాణ బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాము కోరిన స్థానాలను తెలుగుదేశం ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని, తెరాసతో వెళితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో కాకపోయినా మెజార్టీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది.

తెరాసతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేసే అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధించవచ్చనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదించి, వారి ఆమోదం తీసుకోవటం కోసమే కిషన్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. తెరాస, బిజెపి పొత్తు కుదిరితే తాము ఆశిస్తున్న స్థానాలు ఏమిటి, వారు కోరుకునే స్థానాలు ఏమిటనే విషయంలో ఆయన కేంద్ర పార్టీకి ఒక నివేదిక కూడా సమర్పిస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+