తెరాస అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్ వదులుకుంటున్నారా, ఎవరికీ..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఆయన అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటంతో.. పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన పైన పూర్తిస్థాయి దృష్టి సారించేందుకు అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించాలనే యోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవం ఎంతైనాప్పటికీ.. కేసీఆర్ అలా బాధ్యతలు అప్పగిస్తే ఎవరికి ఇస్తారు? అనే విషయమై జోరుగా చర్చ సాగుతోంది.

పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగిస్తారా? అల్లుడు హరీష్ రావుకు ఇస్తారా? లేక సీనియర్లైన ఈటెల రాజేందర్ లేదా ఇతరులకు అప్పగిస్తారా? అనే చర్చ సాగుతోంది. సాధ్యమైనంత వరకు ఇతరులకు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
కేటీఆర్, హరీష్ రావులలో ఎవరికి ఇచ్చినా అది వివాదాస్పదమవుతుందని అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పైన విమర్శలు గుప్పించేందుకు హరీష్ రావు పేరును తరుచూ తీస్తున్నారు. హరీష్ రావుతోనే కేసీఆర్‌కు చిక్కులు అని ఆరోపిస్తున్నారు. దీని పైన హరీష్ రావు వివరణ ఇచ్చిన సందర్భం కూడా ఉంది.


Click it and Unblock the Notifications