వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావుతో కెసిఆర్ భేటీ: ఫిల్మ్ సిటీపై పొగడ్తలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించి, దానిపై ప్రశంసల జల్లు కురిపించారు. రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత, ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావును ఆయన కలిశారు. రామోజీ ఫిలింసిటీ తెలంగాణకే గర్వకారణమని కెసిఆర్ అన్నారు. రామోజీ ఫిలిం సిటీతో పాటు త్వరలో నిర్మించనున్న ఆధ్యాత్మిక నగరం ఓం సిటీలను పర్యాటక ప్రదేశాలుగా మలచడానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కెసిఆర్ దాదాపు నాలుగు గంటలకుపైగా గడిపారు.

 KCR meets Ramoji Rao and praises Ramoji film city

ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేసీఆర్‌ ఫిలిం సిటీకి వెళ్లారు. ఆయనను రామోజీరావు స్వయంగా స్వాగతించారు. వారు కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు ఇరువురు ఏకాంతంగా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఫిలింసిటీలోని ప్రత్యేక ఆకర్షణలను కేసీఆర్‌కు రామోజీ స్వయంగా చూపించారు. తాము ‘ఓం' పేరుతో కొత్తగా చేపట్టబోతున్న ఆధ్యాత్మిక నగరి ప్రాజెక్టు గురించి వివరించారు. ‘ఓం' ఆల్బమ్‌ను ఆయనకు అందించారు.

 KCR meets Ramoji Rao and praises Ramoji film city

ఫిలింసిటీలో సినిమాల కోసం వేసిన సెట్టింగ్‌లను కేసీఆర్‌ ఆసక్తిగా తిలకించారు. ఆయన శుక్రవారం రాత్రి వరకు రామోజీ ఫిలిం సిటీలోనే గడిపినట్లు తెలిసింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను కలిసేందుకు రామోజీరావు అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిసింది. అప్పుడు వివిధ కారణాలవల్ల సమయం కేటాయించలేకపోయిన కేసీఆర్‌ ఇప్పుడు తానే ఫిలిం సిటీకి వెళ్లినట్లు సమాచారం.

 KCR meets Ramoji Rao and praises Ramoji film city

రామోజీ ఫిలింసిటీ ఒక అద్భుత కళాఖండమని, ఎంతో దీక్ష, తపన, బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఇలాంటివి తయారు కావని, ఫిలింసిటీ కంటే ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశమిది అని కెసిఆర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇది అద్భుతమైన బహుమతి అని అన్నారు. తాను చాలా ప్రాంతాలు తిరిగానని, ఏదో చిన్న విస్తీర్ణంలో కొన్ని అంశాలకే అవి పరిమితంగా ఉంటాయని, కానీ రామోజీ ఫిలింసిటీ అద్భుతమని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం ఫిలింసిటీలో తిరిగి చూశాను గానీ అప్పటికీ ఇప్పటికీ పొంతనే లేదని చెప్పారు.

ఓం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమని, దేశంలోని ప్రముఖ దేవస్థానాల నకళ్లను, అంతే ఎత్తు, అదే పద్ధతితో నిర్మించి, నిత్య పూజలు బ్రహ్మాండంగా జరగనుందని కెసిఆర్ అన్నారు. ఇది పూర్తయితే, తెలంగాణకు, హైదరాబాద్‌కు మాత్రమే కాదు భారతదేశానికే అద్భుతమవుతుందని అన్నారు. ఒకేచోట దేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ రెండు మూడు రోజులు ఉండి చూసుకోవచ్చునని అన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao met Eenadu gropu chairman Ramoji Rao, visited Ramoji film city and praised it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X