అక్కడ సంబరాల్లో కేసీఆర్, సింగపూర్ 'పోలీసు'పై ఆరా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సింగపూర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు అందరు పోరాడినందు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిదంని చెప్పారు.

KCR meets Singapore Police commissioner

సింగపూర్ పోలీస్ కమిషనర్‌తో కేసీఆర్ భేటీ

సింగపూర్ పోలీస్ కమిషనర్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగపూర్‌లో రక్షణష నిఘా వ్యవస్థలను నేతలు, అధికారులు తెలుసుకున్నారు. నేర నివారణ, నిఘా, ట్రాఫికి నిర్వహణకు సంబంధించి అధ్యయనం చేస్తున్నారు.

కాగా, గురువారం సింగపూర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. పెట్టుబడులకు హైదరాబాద్ అత్యధిక భద్రత కలిగిన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ అని, జీరో కరప్షన్ ఉంటుందని, సింగిల్ విండో విధానం తమదని చెప్పారు. భూములతో పాటు సౌకర్యాల రూపకల్పన బాధ్యత కూడా తమదే అని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+