కేసీఆర్ తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఇంకో పదేళ్లు బీజేపీయే: వెంకయ్య

అమిత్‌షాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు సరికాదని.. ఐదేళ్లలో తెలంగాణకు నిధులిస్తామన్న మాటలను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

విజయవాడ: అమిత్‌షాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు సరికాదని.. ఐదేళ్లలో తెలంగాణకు నిధులిస్తామన్న మాటలను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

విజయవాడ సిద్దార్థ కళాశాల మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. విభేదాలు పెట్టుకోవడం తమ నైజం కాదని.. కేంద్రం అన్ని రాష్ట్రాలతో మైత్రీ బంధాన్నికొనసాగిస్తోందన్నారు.

KCR Mis-understanding.. BJP will rule more ten years .. says Venkaiah Naidu

విజయవాడలోని సమావేశాన్ని నాందిగా తీసుకుని పార్టీ బలపేతానికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని శక్తిమంతమైన పార్టీగా తయారు చేయాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

'' మోదీ అంటే సుపరిపాలనకు మారు పేరు. మరో పదేళ్లపాటు బీజేపీ దేశ వ్యాప్తంగా అధికార ఢంకా మోగించాలి. దేశం మొత్తం బీజేపీ, నరేంద్ర మోడీవైపే చూస్తోంది. గడచిన మూడేళ్లలో ఒక్క అవినీతి కుంభకోణం లేదు. ఇతర పార్టీలు చీలిక పేలికలుగా తయారయ్యాయి. అవినీతి పరుల పాలిట మోడీ అరివీర భయంకరునిగా తయారయ్యారు. మోదీ వంటి సామాన్యుడు ప్రధాని పదవి చేపట్టారంటే అది బీజేపీ ఘనతే..'' అన్నారు.

రేపటి నుంచి.. మోడీ ఫెస్ట్

రేపటి నుంచి జూన్‌ 15 వరకు 'మోడీ ఫెస్ట్‌' పేరుతో ఉత్సవాలు జరగబోతున్నాయని, పార్టీ శ్రేణులంతా పాల్గొని బీజేపీని ఇంటింటికీ తీసుకెళ్లాలని వెంకయ్య నాయుడు కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆదుకుంటోందని, అయితే కొందరు వ్యక్తులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని ఆయన కార్యర్తలకు సూచించారు.

మహా సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, సురేష్‌ ప్రభు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పి.మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ నేతలు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ,విష్ణుకుమార్‌రాజు, మాధవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+