అక్కడి విజయావకాశాలను బట్టి 'వ్యూహమా? పద్మవ్యూహమా'?
ఓట్లు, సీట్లు సాధించడంద్వారా భారత రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా అవతరింప చేయడమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రథమ వ్యూహంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో జాతీయ పార్టీలు 8 ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ ఉండేవి. తాజాగా ఆప్ పార్టీకి జాతీయ హోదా వచ్చింది.

అవసరమైన 6 శాతం ఓట్లు పొందాలి
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6 శాతం చొప్పున ఓట్లు పొందాలి. లేదంటే మూడు రాష్ట్రాల నుంచి 11 లోక్ సభ సీట్లు సాధించాలి. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. మొదటగా కేసీఆర్ 6 శాతం ఓట్లు సాధించడంపై దృష్టిపెడతారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట, గుజరాత్, న్యూఢిల్లీలో తెలుగువారున్న ప్రాంతాల్లోపోటీచేసి అవరమైన శాతం మేరకు ఓట్లను పొందడమే మొదటి టార్గెట్ గా ఉంది.

బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తు
ఈ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత భారతీయ జనతాపార్టీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు. తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని వినిపించారు. దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించిన అంశాల్లో కేసీఆర్ దూకుడుగా రాజకీయం చేసే అవకాశం కనపడుతోంది. కేసీఆర్ గతంలో కూడా రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించడంతోపాటు పంజాబ్ వెళ్లి మరీ చెక్కులను పంపిణీ చేశారు.

ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టరు?
బీజేపీని దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశం కనపడినా సద్వినియోగం చేసుకునే దిశగానే కేసీఆర్ ప్రయాణం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీయేతర కూటమిలో చేరుతుందా? లేదంటే యూపీఏలో చేరుతుందా? అనేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలమీద ఆధారపడివుంటుంది. చివరగా తెలంగాణ ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ తదుపరి వ్యూహం రూపొందించే అవకాశం కనపడుతోంది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications