అంగుళం వదలొద్దు: గురుకుల్ భూములపై కొరడా

హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్, వాటి పరిసరాల్లోని భూముల అక్రమ ఆక్రమణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ఆయన ఆదేశించారు. అనుమతి లేని కట్టడాల కూల్చివేత విషయంలో అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు.

ఆక్రమణదారులకు ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అనుమతి ఉన్నప్పటికీ, నిబంధనలను విస్మరించి కట్టడాలు నిర్మిస్తే వాటి విషయంలో చర్యలు తీసుకునే ముందు మాత్రం నోటీసులు జారీ చేయాలన్నారు. గురుకుల్ ట్రస్టు భూములను రక్షించాలన్నారు.

K Chandrasekhar Rao

గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల గురుకుల్ ట్రస్టు భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఇక్కడ నిర్మాణాలకు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. గురుకుల్ ట్రస్టు భూములు అంగుళం కూడా వదలవద్దని, మొత్తం ప్రభుత్వపరం కావాల్సిందేనని సూచించారు. వాటిని అక్రమించుకునేందుకు సహకరించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అక్రమ కట్టడాలకు విద్యుత్తు, తాగునీటి కనెక్షన్ ఇవ్వడమూ అక్రమంగానే పరిగణించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

పోలీసు శాఖపై కెసిఆర్ నిర్వహించిన సమీక్షలో డిజిపి అనురాగ్ శర్మతోపాటు జంట నగరాల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, కుటుంబాలను ఎవ్వరు పాడుచేసినా సహించవద్దని ఆదేశించారు. తెలంగాణలో ఎక్కడా పేకాట క్లబ్బులు ఉండటానికి వీల్లేదని, వాటి వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని పోలీసు అధికారులకు స్పష్టంగా ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+