ఆంధ్రలోని సింగరేణి ఆస్తులు కాపాడండి: కెసిఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సింగరేణి సంస్థకు ఉన్న ఆస్తులను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. కృష్ణా జిల్లా కొండపల్లిలోని సింగరేణి భూముల సరిహద్దులను గుర్తించి ప్రహరీని నిర్మించాలని, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా కృష్ణా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని సూచించారు. సింగరేణిపై కెసిఆర్ సోమవారం సమీక్ష జరిపారు.
విజయవాడ, వైజాగ్‌ల్లో సింగరేణి ఆస్తులను కూడా కాపాడుకోవాలని సూచించారు. నవంబర్ 15, 2015 నాటికి తొలి 600 మెగావాట్ల విద్యుత్తు యూనిట్ ఉత్పత్తికి సిద్ధమవుతుందని సింగరేణి సిఎండి భట్టాచార్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సింగరేణి కార్యకలాపాల వల్ల తలెత్తుతున్న వాయు, జల కాలుష్యం గురించి సీఎం ఆరా తీశారు. కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో కనీసం కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.

ఎన్టీపీసీ నిర్మించనున్న 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు వంద శాతం తెలంగాణకే చెందుతుందని కెసిఆర్ తెలిపారు. అందుకు అవసరమైన 1500 ఎకరాల భూమిని రామగుండంలో ఎన్టీపీసీకి కేటాయించాలని సింగ రేణి అధికారులను ఆదేశించారు. తెలంగాణ జెన్‌కో కూ రామగుండంలో 400 ఎకరాలు, మణుగూరులో 2000 ఎకరాలను కేటాయించాలని ఆదేశించారు.
సమావేశంలో సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య, టి-జెన్‌కో సీఎండీ డి.ప్రభాకరరావు, సింగ రేణి డైరెక్టర్ రమేష్‌కుమార్, కార్మిక నేత రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ రమేష్‌కుమార్ సింగరేణి కార్యకలా పాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications