చంద్రబాబుతో చేతులు కలిపారు: టీడీపీ మహానాడులో 'కేసీఆర్'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహానాడులో సందడి చేస్తున్నారు! మహానాడులో సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు.

కేసీఆర్ మరో రకంగాను మహానాడులో సందడి చేస్తున్నారు. మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ పెడతారు. ఇందులో కేసీఆర్ ఫోటో కూడా ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం.. సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రిలు గవర్నర్ సమక్షంలో భేటీ అయ్యారు.

 KCR Photo and name in Telugudesam Mahanadu

నాడు గవర్నర్ నరసింహన్ సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్‌లు చేతులు కలుపిన ఫోటో, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో వీరిద్దరుకలుసుకున్న ఫోటోలను ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఎన్టీఆర్ ఫోటోలతో పాటు ఇవి ఆకట్టుకుంటున్నాయి.

కాగా, సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు తెలంగాణ సీఎం పైన నిప్పులు చెరుగుతున్నారు. తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని, తమ పార్టీ ఎమ్మెల్యేలను పశువులను సంతలో కొన్నట్లుగా కొంటున్నారని చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+