తెలంగాణలో చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆశలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నీళ్లు చల్లినట్లే కనిపిస్తున్నారు. కాంగ్రెసులో తెరాస విలీనమవుతుందని చంద్రబాబు గట్టిగా నమ్ముతూ వస్తున్నారు. నమ్మడమే కాదు, బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చారు. కానీ, కెసిఆర్ ప్లేటు ఫిరాయించి కాంగ్రెసులో తమ పార్టీని విలీనం చేయబోమని ప్రకటించారు.

కెసిఆర్ నిర్ణయం తెలుగుదేశం పార్టీపై పిడుగు పడినట్లయింది. కాంగ్రెసులో తెరాస విలీనమైతే తమకు కాంగ్రెసుతో ముఖాముఖి పోటీ ఉంటుందని చంద్రబాబు భావిస్తూ వచ్చారు. అయితే, త్రిముఖ పోటీ లేదా బహుముఖ పోటీ జరిగితే కాంగ్రెసు, తెరాసలు మాత్రమే తెలంగాణలో పోటీ పడే పరిస్థితి ఉంటుందని తాజా సర్వేను బట్టి అర్థమవుతోంది.

KCR plan may hit TDP and BJP in Telangana

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు బిజెపి బలపడినట్లు కనిపించింది. అయితే, బిజెపి అనుకున్నంతగా లాభపడడం లేదు. సంకినేని వెంకటేశ్వర రావు వంటి కొద్ది మంది చేరినప్పటికీ పెద్ద యెత్తున వలసలు లేవు. కాంగ్రెసులో విలీనం కాకూడదని నిర్ణయం తీసుకోవడం తెరాసలోకి వలసలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో తెరాసలోకి వెళ్లలేనివారు కాంగ్రెసులోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. తెరాసలోకి వెళ్లలేనివారిని కాంగ్రెసు, బిజెపి పంచుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసలోకి వలసలు పెరిగాయి. ఇప్పటి వరకు 15 మంది శాసనసభ్యులు తెరాసలోకి వెళ్లారు. అవి మరింత పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. బలమైన టిడిపి నేతలు కూడా అటువైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు, తెలుగుదేశం పార్టీ నాయకులను కాంగ్రెసు కూడా ఆహ్వానిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్టీ శాసనసభ్యుల్లో ఎంత మంది తెలుగుదేశంలో ఉంటారనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.

పైగా, చంద్రబాబు నిర్ణయాలు కూడా తెలంగాణలో పార్టీకి నష్టం చేసే పరిస్థితిని తెచ్చి పెట్టినట్లు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను విడుదల చేయాలని అనుకోవడం, తెలంగాణకు ప్రత్యేక కమిటీ వేసే విషయంలో వెనకంజ వేయడం వంటివి తెలంగాణలో పార్టీకి నష్టం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

తెలంగాణకు ప్రత్యేక కమిటీ వేసి దానికి నాయకుడిని నియమిస్తే నష్టం జరుగుతుందనే భావనతో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ కమిటీకి నాయకుడిని నిర్ణయిస్తే అతనే భావి తెలంగాణ ముఖ్యమంత్రిగా ముందుకు వస్తాడని, దాని వల్ల తెలంగాణ తెలుగుదేశంలో లుకలుకలు ప్రారంభమవుతాయని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ ఆలోచన పార్టీని దెబ్బ తీసే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలుగుదేశంలో ఉన్న తెలంగాణ నాయకులు ఎవరికి వారే తమ స్థానాలను చూసుకుంటూ పార్టీని గెలిపించాలనే లక్ష్యాన్ని విస్మరిస్తారని అంటున్నారు.

ఒక నాయకుడంటూ ఉంటే పార్టీలోని ఇతర నాయకులకు విశ్వాసం కల్పించి, పార్టీ శ్రేణులను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తాడని, ఇదే పార్టీకి లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. కానీ చంద్రబాబు వినే స్థితిలో లేరని, ప్రత్యేక కమిటీ ఏర్పాటు ఆలోచనను సీమాంధ్ర నాయకులు పడినట్టేట్లు లేరని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+