కెసిఆరే దేవుడు: నిత్యం పూజలు చేస్తున్న యువకుడు
కరీంనగర్: అవును.. అతని దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేవుడే. దశాబ్ధాల పోరాటాలకు తెరదించుతూ తెలంగాణ సాధించిన కెసిఆర్.. తన దృష్టిలో దేవుడేనంటున్నాడు ఓ యువకుడు.
అంతేగాకుండా కెసిఆర్ చిత్రపటాన్ని దేవుడి ఫొటోల చెంత పెట్టి నిత్యం పూజలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పోలం సతీష్ యాదవ్ ఎలక్ట్రికల్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించినప్పట్నుంచీ... కెసిఆర్‌కు సతీష్ వీరాభిమాని. తెలంగాణ రాష్ట్రం నిజమవడంతో ఆ అభిమానం రెట్టింపు అయింది.
అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన కెసిఆర్ నిజంగా దేవుడిలా భావించిన సతీష్.. పెద్దపల్లిలోని తన షాపులో కెసిఆర్ చిత్ర పటానికి నిత్యం పూజలు చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.












Click it and Unblock the Notifications