అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంగా ఏపీలో కేసీఆర్ రాజకీయం!

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని బలపరచడమే లక్ష్యంగా ఆయన పనిచేయబోతున్నారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడంకన్నా ప్రస్తుతానికి లోక్ సభ ఎన్నికలకే ప్రాధాన్యతనిస్తున్నారు.

 కేసీఆర్ కు ఆహ్వానం పలికిన పార్టీలు

కేసీఆర్ కు ఆహ్వానం పలికిన పార్టీలు


కేసీఆర్ కు రైతుసంఘాలతోపాటు పలు పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. పాతబస్తీలోని ఎంఐఎంతోపాటు కుమారస్వామి జేడీఎస్, సీపీఎం, సీపీఐతోపాటు ఉత్తర భారతంలో మద్దతు పలికేపార్టీలెన్ని అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నీ జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కేసీఆర్ కు ఆహ్వానం పలికాయి.

కర్ణాటకలో ఏ నిర్ణయం తీసుకుంటారో?

కర్ణాటకలో ఏ నిర్ణయం తీసుకుంటారో?


కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో తెలుగువారున్నారు. వీరున్న చోట పోటీచేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే వీరిలో ఎక్కువ మంది ధ్ర ప్రాంతానికి చెందినవారే ఉంటారు. మరి ఇక్కడ కేసీఆర్ ఎటువంటి నిర్ణయాం తీసుకుంటారో చూడాలి. జాతీయ రాజకీయాల్లో ఆయన అసద్దుదీన్ తో కలిసి కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పాల్గొంటూ వస్తోంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర.. ఇలా అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో పాల్గొంటోంది.

 ఒవైసీపీ నిప్పులు చెరుగుతున్న దీదీ

ఒవైసీపీ నిప్పులు చెరుగుతున్న దీదీ


బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసదుద్దీన్ పై మండిపడుతున్నారు. బీజేపీ అభ్యర్థులు నిలబడిన సీట్లలో మైనారిటీ ఓట్లను చీల్చి ఆ పార్టీకి లబ్ధిచేకూర్చడానికే ఆయన తన అభ్యర్థులను నిలబెడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. పోటీచేసిన అన్ని సీట్లలో ఎంఐఎం అతి తక్కువ సంఖ్యలోనే గెలవగులుగుతోంది. గెలుపోటములకన్నా ఓట్ల చీలికపైనే ఆ పార్టీ దృష్టిపెడుతుండటంతో బీజేపీకి లబ్ధి చేకూరుతోంది. బెంగాల్ లో ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ బీజేపీ మిత్రుడొస్తున్నారు.. మైనారిటీ ఓట్లు చీల్చడానికి అంటూ చేసిన ప్రచారం బాగా కలిసొచ్చింది. మైనారిటీలంతా దీదీకే పట్టం కట్టారు.

జగన్ కు సన్నిహితుడే!

జగన్ కు సన్నిహితుడే!


వాస్తవానికి ఏపీలో పోటీకి అసదుద్దీన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. మైనారిటీలంతా అసదుద్దీన్ కు మద్దతు పలికితే జగన్ నష్టం చేకూరుతుంది. ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఓట్లు సాధించడానికి అసదుద్దీన్ తో కలిసి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి తరఫున రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే వీరంతా రాష్ట్రంలో జగన్ కు మద్దతు తెలియజేస్తున్నారు. కేసీఆర్ కు, అసదుద్దీన్ కు ఇద్దరికీ జగన్ సన్నిహితుడే కావడంతో వీరి రాజకీయం ఎలా ఉండబోతోందో? అనే ఆసక్తి అందరిలో వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+