జగన్ పార్టీ ఏపీ ఎమ్మెల్యేలపై కేసీఆర్, మేం వెళ్లలేదని షాకిచ్చారు
హైదరాబాద్: ఫిరాయింపుల పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి మండిపడ్డారు. మీరు చేస్తే నీతి, మేం చేస్తే అవినీతా అని ప్రశ్నించారు. ఈ సమయంలో కేసీఆర్.. పలువురు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పారు.
ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత... ఏ పార్టీల నుంచి గెలిచారు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? దీనికి బాబు ఏం సమాధానం చెబుతారు? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఏడుగురు ఎమ్మెల్యేలు (ఆరుగురు వైసీపీ, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేలు) కోన రఘుపతి (బాపట్ల), రవి కుమార్ (అద్దంకి), ముస్తఫా (గుంటూరు), జలీల్ ఖాన్ (విజయవాడ), ఉప్పులేటి కల్పన, వెంకటరమణ, ఆమంచి కృష్ణమోహన్.. వీళ్లంతా ఏ పార్టీ నుంచి గెలిచారు? ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నించారు.

అయితే, దీనిపై పలువురు ఎమ్మెల్యేలు స్పందించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. తాము వైసీపీలోనే ఉన్నామని, కేసీఆర్ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఇది తగదని కొందరు చెప్పారు.
జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కూడా వైసీపులోనే ఉన్నారని, తాము చివరి వరకు వైయస్ జగన్ వెంటే ఉంటామని చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications