అసద్ మనోడే, హైద్రాబాద్‌లో తప్ప: కెసిఆర్ ఆసక్తికరం

అసద్ భాయ్ మనోడేనంటూ వ్యాఖ్యానించారు. మెదక్‌లోని సిఎస్ఐ మైదానంలో జరిగిన సభలో పాల్గొన్న కెసిఆర్ మజ్లిస్ అదినేత అసద్ పేరు నేరుగా ప్రస్తావించారు. హైదరాబాదు పార్లమెంటు స్థానాన్ని మినహా మిగతా పదహారు స్థానాలలో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అదే సమయంలో పవన్, చంద్రబాబు, మోడీలపై విమర్శలు గుప్పించారు. మోడీ అటుపక్క ఓ ఆంధ్రా వ్యక్తి, ఇటు పక్క ఓ ఆంధ్రా వ్యక్తిని కూర్చో బెట్టుకున్నారని ధ్వజమెత్తారు. 1+1+1=111 అవుతుందని మోడీ అంటున్నారని, కానీ జీరో అవుతుందని దుయ్యబట్టారు. మతతత్వ బిజెపితో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదని మూడో కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.
దళితుల భూములను ఆక్రమించుకున్న ఒక దొంగను ఏఐసిసి నేతలు రాహుల్, జైరాం రమేశ్‌లు టి పిసిసి అధ్యక్షుడిగా నియమించారంటూ పొన్నాలపై నిప్పులు చెరిగారు. ధర్మసాగర్ మండలం రాంపూర్‌లో దళితులకు చెందిన 14ఎకరాల భూమిని పొ న్నాల ఆక్రమించుకున్నారని, జైరాంకు దమ్ముంటే పొన్నాల భూ కబ్జాలపై స్పందించాలన్నారు. పొన్నాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications