వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు బాబు అవరోధం, బీజేపీని గెలిపించొద్దు: కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు పెద్ద ఎత్తున అవరోధాలు, ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ కేసీఆర్ అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం తెరాస భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మనకు రావాల్సిన విద్యుత్ రాకుండా చేస్తున్నారని బాబుపై నిప్పులు చెరిగారు.

KCR says don't vote to BJP and TDP

చంద్రబాబు ఎన్డీయే కూటమికి మద్దతుదారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఆయనకు వత్తాసు పలుకుతోందన్నారు. ఏడు మండలాలను ఏపీ లాక్కుంటే.. తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ, టీడీపీలు అవరోధమన్నారు. తెలంగాణకు అవరోధంగా మారిన బీజేపీ, టీడీపీలను గెలిపించవద్దన్నారు.

ఆన్ లైన్లో 30 లక్షల సభ్యత్వం జరిగిందన్నారు. మొత్తం 50 లక్షల మంది తెరాసలో సభ్యులుగా చేరారని చెప్పారు. సభ్యత్వాల ద్వారా రూ.9.26 కోట్లు వసూలయ్యాయన్నారు. ఈ నెల 24న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ 2న గ్రామ కమిటీల ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

English summary
Telangana CM KCR says don't vote to BJP and TDP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X