టీలో తెరపైకి కొత్త పోస్ట్‌లు: అనుభవంతో కేసీఆర్ 'సంతృప్తి' ప్లాన్!
హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ నిర్ణయంతోపాటు పార్లమెంటరీ సెక్రటరీలను నియమించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ కొత్త పదవులపై పడింది. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ సెక్రటరీ అనేది కొత్తగా వినిపిస్తున్న పదవి అయినా, ఇది 36 ఏళ్ల క్రితం నాటిదే. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి 1978లో ఈ పదవిని ప్రవేశపెట్టారు.
ఇప్పుడు కేసీఆర్, అప్పుడు చెన్నారెడ్డిలు పదవులను పరిచయం చేయడం వెనుక వారి సొంత అనుభవాలు కూడా ఉన్నాయి. చెన్నారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా పార్లమెంటరీ సెక్రటరీ పదివిని పరిచయం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి పార్లమెంటరీ సెక్రటరీ పదవి నిర్వహించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆనాటి జ్ఞాపకాలతో ఈ పదవిని రాష్ట్రంలో అదే పేరుతో పరిచయం చేశారు.

ఎన్టీఆర్ కరువు మంత్రుల పేర్లతో కొత్త మంత్రులను పరిచయం చేశారు. ఎన్టీఆర్ నియమించిన కరవు మంత్రుల్లో కేసీఆర్ కూడా ఉన్నారు. ఆనాటి ఆనుభవంతో కేసీఆర్ ఇప్పుడు పార్లమెంటరీ సెక్రటరీ పదవులను తిరిగి పునరుద్ధరించారు. చెన్నారెడ్డి ప్రభుత్వంలో కేఈ కృష్ణమూర్తిలాంటి వారు పార్లమెంటరీ సెక్రటరీగా పని చేశారు. కేంద్రంలో పార్లమెంటరీ సెక్రటరీ అయితే ఆయా మంత్రులకు అనుబంధంగా ఉంటారు.
ఓ రకంగా ఆ మంత్రికి వీరు చేదోడు వాదోడుగా ఉంటారు. చెన్నారెడ్డి ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీలకు ఫోన్‌వంటి సౌకర్యం మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు మంత్రుల తరహాలో వీరికీ కొన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్‌లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో సైతం కేబినెట్ ర్యాంకుతో నియమిస్తున్నందున, పార్లమెంటరీ సెక్రటరీలకు సైతం మంత్రుల్లా కొంతవరకు సౌకర్యాలు కల్పించనున్నారు.
ఢిల్లీలో అయితే పార్లమెంటరీ సెక్రటరీ పార్లమెంటుకు, మంత్రిత్వశాఖకు మధ్య సమన్వయకర్తగా పని చేస్తారు. మంత్రి తరఫున సెక్రటరీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే అంతిమ బాధ్యత మాత్రం మంత్రిదే. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో సైతం అసెంబ్లీకి, మంత్రిత్వ శాఖకు మధ్య సమన్వయ కర్తగా ఈ పార్లమెంటరీ సెక్రటరీలు పని చేసే అవకాశముంది.
శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావులు ట్రైనీ మినిస్టర్స్‌గా రానుందంటున్నారు.ఈ పదవి ముప్పై ఏళ్ల తర్వాత వస్తోంది. కాగా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ ఇలా ఆయా పోస్టులను తీసుకు వస్తున్నారనే వారు లేకపోలేదు.












Click it and Unblock the Notifications