అధికార నివాసానికి కెసిఆర్, అందుకే వద్దని బాలకృష్ణ..!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అధికారిక నివాసానికి మారారు. ఉదయం బేగంపేటలోని నివాసానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. వాస్తు కోసం కెసిఆర్, కుటుంబ సభ్యులు సుదర్శన యాగం నిర్వహించారు.
కేన్సర్ ఆసుపత్రి కోసమే బాలకృష్ణ కేబినెట్లోకి రాలేదు

అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ బసవతాకరం కేన్సర్ ఆసుపత్రి కోసమే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి పదవి తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్ ఆదివారం అన్నారు.
బసవతాకరం 14వ వార్షికోత్సవాలను నిర్వహించారు. దీనికి స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే బాలకృష్ణలు వచ్చారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడారు. కేన్సర్ ఆసుపత్రి కోసమే బాలయ్య మంత్రి పదవిని తీసుకోలేదన్నారు. సభాపతి హోదాలో ఆసుపత్రికి రావడం ఆనందంగా ఉందన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని స్థాపిస్తామని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా: దేవినేని
మంత్రిగా ఎపి అభివృద్ధి కోసం కృషి చేస్తానని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటామన్నారు. ఆయకట్టు చివరి భూములకు కూడా సాగునీరు అందిస్తామన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు రోజుకు 18 గంటలు పని చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications