టిటిడిపి టార్గెట్: బాబును ఏకేసిన కెసిఆర్, మాట్లాడట్లేదని

హైదరాబాద్: ఇద్దరు శాసన సభ్యులు, తొమ్మిది మంది శాసన మండలి సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసంగిస్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చేరికలు రాజకీయ చేరికలు కావన్నారు. తెలంగాణ రాజకీయ పునరేకీకరణ అన్నారు. అందరం చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి.. ప్రజలకు నాయకత్వం వహిద్దామన్నారు. రాజకీయం కంటే రాష్ట్ర ప్రగతి అవసరమన్నారు.

తాను తెలంగాణ కోసం తెరాసను స్థాపించినప్పుడు ఇది ఆరు నెలలు కూడా ఉండదని చాలామంది అన్నారని, ఇప్పుడు వారే కొట్టుకు పోయారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో కొందరు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు చరిత్రలో లేని విధంగా పదకొండు మంది ప్రజాప్రతినిధులు తెరాసలో చేరడానికి... తెలంగాణ కోసం, శత్రువుల దాడి నుండి తట్టుకునేందుకన్నారు. తెలంగాణలో రాజకీయ శక్తి ఏకీకృతం కావాల్సి ఉందన్నారు.

KCR slams Chandrababu, target TTDP

రాజకీయ కారణాలతో ఎవరూ తెరాసలో చేరలేదని, బంగారు తెలంగాణ కోసమే చేరారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఎపి ఏర్పాటు, ఎపి అంతర్థానం, తెలంగాణ ఏర్పాటు అంతా చరిత్ర అన్నారు. పదేళ్లు రాజధానిగా తెలంగాణ అంగీకరించినప్పటికీ.. ఎపిలో ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణపై ఉన్న కసిని బయట పెట్టుకుంటుందన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎపిలో కలుపుకున్నారని విమర్శించారు.

తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, గిరిజనులను ముంచే ప్రయత్నానికి వ్యతిరేకమని సభ సాక్షిగా చెప్పామన్నారు. చట్టం ప్రకారం ఏ ప్రభుత్వమైనా నడుచుకోవాలని కానీ, ఎపి ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా వెళ్తోందన్నారు. తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రా విద్యార్థులకు బోధనా రుసుం ఇవ్వాలని ఎపి మంత్రులు గవర్నర్‌ను కలిశారని విమర్శించారు. ఎపి ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.

తాను ఏం మాట్లాడినా విమర్శలు వస్తాయని.. కొద్దిరోజులుగా ఏం మాట్లాడకుండా పని చేసుకు పోతున్నానని చెప్పారు. అరవయ్యేళ్ల పాటు పోరాటం చేసి ప్రజలు తెలంగాణ సాధించుకున్నారన్నారు. తెలంగాణ కోసం తాను 2001లో పోరాటం ప్రారంభించినా... అంతకుముందు గొప్ప పోరాట యోధులు ఉన్నారన్నారు. ఈ రోజు తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ... తెలంగాణ పోరాట యోధుడు ఆమోస్‌ను తానే ముందు పలకరిస్తానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్.. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబితే, ఆంధ్రప్రదేశ్‌లో మరోరకంగా చెప్పారన్నారు. వచ్చిన తెలంగాణ బాగుపడాలంటే.. తెలంగాణ నాయకత్వం ఏకం కావాల్సిందేనన్నారు. ఆ దిశగా తాను ముందుకు కదులుతున్నానని చెప్పారు. తెలంగాణలోని టీడీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వారు ఇంకా తెలంగాణ ద్రోహ టీడీపీ పార్టీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. వారికి ఏమాత్రం తెలంగాణ పౌరుషం ఉన్నా వెంటనే టీడీపీని వీడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+