కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన తన కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న నిజామాబాదుతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా టి కాంగ్రెసు, టిడిపి అధినేత చంద్రబాబులపై నిప్పులు చెరిగారు.

కెసిఆర్ ఆస్తులపై విచారణ జరిపిస్తామన్న పొన్నాల లక్ష్మయ్య హెచ్చరికపై కెసిఆర్ తీవ్రంగా స్పందించారు. పొన్నాల వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, కాంగ్రెసోళ్లకు దమ్ముంటే తన ఆస్తులపై విచారణ జరుపుకోవచ్చునని, పొన్నాలే ఆ పని చేయొచ్చన్నారు.

పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తానని పొన్నాలను హెచ్చరించారు. తనదేమైనా తప్పు ఉంటే బతుకనిద్దురా, ఎప్పుడో జైళ్లో పడేస్తుండేవారన్నారు. మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మూడు మంత్రి పదవులను ఇస్తామని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ, మెదక్‌లోనూ సుడిగాలి పర్యటన చేశారు.

 కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కరీంనగర్ జిల్లాలో కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, చొప్పదండి, వేములవాడ, మానకొండూర్, హుజూరాబాద్, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో కెసిఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉత్త పుణ్యానికి రాలేదని చెప్పారు.

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

తెలంగాణ కోసం ఒక్కనాడన్న లాఠీ దెబ్బలు తిన్నారా? రాస్తారోకోలు చేశారా? బస్సులను, రైళ్లను ఆపారా? పదవులకు రాజీనామా చేశారా? అని తెలంగాణ కాంగ్రెస్ నేతలను కెసిఆర్ ప్రశ్నించారు.

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

ఆంధ్రోళ్లు తెలంగాణ నీళ్లు తీసుకపోతుంటే జెండా ఊపిన సన్నాసి పొన్నాల అని దుయ్యబట్టారు. తెరాసను విమర్శించడానికి సిగ్గుండాలని, లజ్జా ఉండాలంటూ పొన్నాలపై విరుచుకుపడ్డారు. పొన్నాల లక్ష్మయ్యది నీతి మాలిన రాజకీయమన్నారు.

 కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

దళితుడికి సీఎం పదవిని, మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని కొన్నాళ్లుగా చెబుతున్న కెసిఆర్, మైనారిటీలకు ఇచ్చిన హామీని జగిత్యాల సభలో పునరుద్ఘాటించారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని, రెండు నుంచి మూడు మంత్రి పదవులు కేటాయిస్తామని, 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.

 కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలకు టోపీ పెట్టారని, టిడిపితో దోస్తీ చేస్తే మధ్యలో వదిలేశారన్నారు. తెరాసతో దోస్తీ చేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, మెరు గైన విద్యుత్తు రావాలన్నా, సాగు, తాగు నీరు సాధించుకోవాలన్నా తెరాస అధికారంలోకి రాక తప్పదని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాలన వల్ల తెలంగాణలో విద్యుత్తు కోతలు తప్పడం లేదని విమర్శించారు.

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

సీమాంధ్ర సిఎం, తెలంగాణ చేతకాని మంత్రుల కారణంగా విద్యుత్ ప్రాజెక్టులు విజయవాడకు తరలిపోయాయన్నారు. కరెంటు గురించి ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేనని చెప్పారు. మూడేళ్ల దాకా మీకు కరెంట్ బాధలు తప్పవన్నారు. అబద్ధాలు చెప్పడం కెసిఆర్‌కు చేతకాదన్నారు.

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

కూతురు కోసం: వారిని దువ్వుతున్న కెసిఆర్ (పిక్చర్స్)

మూడేళ్ల తరువాత 24 గంటలు రైతులకు కరెంటు ఉండేలా చూసే బాధ్యత తనదన్నారు. దీనికోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+