చిన్నారి శరత్ కోరిక తీర్చిన కెసిఆర్ (ఫొటోలు)

హైదరాబాద్: గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారి శరత్ కోరికను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీర్చారు. గురువారం మధ్యాహ్నం ఆయన అపోలో ఆస్పత్రికి వెళ్లి శరత్‌ను పరామర్శించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును చూడాలని ఉందని, కెసిఆర్‌తో మాట్లాడాలని ఎప్పటి నుంచో కోరికగా ఉందని శరత్ చెప్పాడు.

శరత్ కోరికను తీర్చేందుకు మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులు కెసిఆర్‌ను కలిసి విషయం చెప్పారు. దాంతో కెసిఆర్ అపోలో ఆస్పత్రికి వెళ్లి శరత్‌ను పరామర్శించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కోరికను తీర్చేందుకు మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులు పనిచేస్తుంటారు. ఇందులో భాగంగా వారు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరత్‌ను కలిసి అతని ఆకాంక్షను తెలుసుకున్నారు.

శరత్ కోరిక తీర్చిన కెసిఆర్

శరత్ కోరిక తీర్చిన కెసిఆర్

సెప్టల్ డిఫెక్ట్‌తో బాధపడుతూ ఆపోలోలో చికిత్స పొందుతున్న చిన్నారి శరత్‌ను అపోలో ఆస్పత్రిలో కెసిఆర్ పలకరించారు.

శరత్ కోరిక తీర్చిన కెసిఆర్

శరత్ కోరిక తీర్చిన కెసిఆర్

నీకేమైనా కోరికలు ఉన్నాయా అని మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధి ప్రియ తలూరి అడిగినప్పుడు ఏ మాత్రం తడుముకోకుండా తనకు కెసిఆర్‌ను చూడాలని ఉందని శరత్ చెప్పాడు.

శరత్ కోరిక తీర్చిన కెసిఆర్

శరత్ కోరిక తీర్చిన కెసిఆర్

గ్రామంలో టైలరింగ్ చేసే బాలుడి తండ్రి బాలయ్య కూడా తన కుమారుడు ఎప్పుడూ కెసిఆర్ గురించే ఆలోచిస్తున్నాడని చెప్పాడు.

శరత్ కోరిక తీర్చిన కెసిఆర్

శరత్ కోరిక తీర్చిన కెసిఆర్

తనను చూడాలనే కోరికను వెల్లడించిన శరత్‌ను కెసిఆర్ అపోలో ఆస్పత్రికి వెళ్లి పలకరించారు. అతని ఆకాంక్షను నెరవేర్చారు.

వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన కొండా శరత్ (11)కు పుట్టినప్పుడే గుండె కవాటానికి సంబంధించిన వ్యాధి ఉంది. దీంతో అతని తల్లిదండ్రులు శరత్‌కు హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

ప్రస్తుతం అతనికి మెరుగ్గా ఉన్నా మరో రెండు మూడు సార్లు శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చునని, అప్పటికీ నయమవుతుందనే గ్యారంటీ లేదని వైద్యులు చెబుతున్నారు. గురువారం ఉదయం పోలీసు వాహనాలను ప్రారంభించిన తర్వాత కెసిఆర్ అపోలో ఆస్పత్రికి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+