సిఎం కెసిఆర్ ప్రమాణం: జానారెడ్డితో ఆలింగనం(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శాసనసభలో ఎమ్మెల్యేగా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. కెసిఆర్‌తో ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తెలంగాణ మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. తర్వాత మహిళా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొనసాగింది.

నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభ వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే ముందుగా సిఎం కెసిఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం కేబినెట్ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ జానారెడ్డి వీరందరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కే చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీకి విచ్చేశారు. సిఎం ఛాంబర్ కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి సమావేశాలు కూడా సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలిలో 30 మంది ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు శాసనమండలి శ్రద్దాంజలి ఘటించారు. తరువాత సభ బుధవారానికి వాయిదా పడింది. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, లక్ష్మీనారాయణ సభకు గైర్హాజరయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ లొగోలో ఉర్దూ లేనందకు నిరసనగా తొలత ప్రమాణస్వీకారం చేసేందుకు కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీ నిరాకరించారు. ఈ అంశంపై సిఎం కెసిఆర్‌తో మాట్లాడుతామని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ హామీ ఇవ్వడంతో షబ్బీర్ అలీ ప్రమాణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి మధుసూదనాచారి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, మంత్రులు, అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు హాజరయ్యారు. మంగళవారం తెలంగాణ స్పీకర్ ఎన్నిక జరుగనుంది.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి మధుసూదనాచారి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, మంత్రులు, అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు హాజరయ్యారు.

కెసిఆర్ పూజలు

కెసిఆర్ పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కే చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీకి విచ్చేశారు. సిఎం ఛాంబర్ కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రమాణం

ప్రమాణం

కెసిఆర్‌తో ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తెలంగాణ మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. తర్వాత మహిళా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొనసాగింది.

కెసిఆర్ ప్రమాణం

కెసిఆర్ ప్రమాణం

సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే ముందుగా సిఎం కెసిఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

జానారెడ్డితో ఆలింగనం

జానారెడ్డితో ఆలింగనం

ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం సీనియర్ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ జానారెడ్డిని ఆలింగనం చేసుకున్న కెసిఆర్.

కెసిఆర్ ప్రమాణం

కెసిఆర్ ప్రమాణం

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ పుస్తకంలో సంతకం చేస్తున్న కెసిఆర్

నేతి విద్యాసాగర్ రావు

నేతి విద్యాసాగర్ రావు

శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేతి విద్యాసాగర్ రావు.

నేతి విద్యాసాగర్ రావుతో కెసిఆర్

నేతి విద్యాసాగర్ రావుతో కెసిఆర్

శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన నేతి విద్యాసాగర్ రావుతో కెసిఆర్.

ప్రొటెం స్పీకర్ జానారెడ్డి

ప్రొటెం స్పీకర్ జానారెడ్డి

రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి.

అభినందనలు

అభినందనలు

రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జానారెడ్డికి అభినందనలు తెలుపుతున్న కెసిఆర్.

పద్మారావు

పద్మారావు

ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టి పద్మారావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+