అదే కాంగ్రెస్‌కు శాపం: నారాయణ, టి తొలి సిఎం కెసిఆరే!

KCR will become CM for Telangana: Narayana
వరంగల్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పదవి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకే దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో సోమవారం రాత్రి ప్రయాణించిన ఆయన వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు ఆగిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్‌కు నాయకత్వ లోపమే శాపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు వస్తాయని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడట, ఆ పార్టీ నాయకులు అన్ని ప్రాంతాల్లో ఉమ్మడిగా ప్రచారం చేయకపోవడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేట్లుగా ఉందని తెలిపారు. తెలంగాణలో అన్ని జిల్లాల వారిగా పరిశీలిస్తే ఇదే పరిస్థితి కనిపించిందని అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు చెబుతున్నట్లుగా ఆ పార్టీకి మెజార్టీ స్థానాలే రావచ్చునని అన్నారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్-టిఆర్ఎస్ ఉమ్మడి ఒప్పందం కుదుర్చుకుని కలిసి పనిచేస్తే నూటికి నూరు శాతం సీట్లు దక్కేవని నారాయణ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన సిపిఐతో కూడా జతకట్టి ఎన్నికల్లో మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తే బాగుండేదనే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్.. తెలంగాణ ఇచ్చిందనే బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉందని, దాన్ని ఉపయోగించుకుని ప్రచారం చేసే సమర్థ నాయకత్వం తెలంగాణలో కాంగ్రెస్‌కు కరువైందని నారాయణ అన్నారు.

జిల్లాల వారిగా బలబలాలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్, టిఆర్ఎస్ పోటీ పడ్డాయని వివరించారు. కొన్ని స్థానాల్లో అటు కాంగ్రెస్, ఇటు టిఆర్‌ఎస్ ప్రత్యర్థి నుండి గట్టి పోటీనే ఎదుర్కొన్నాయన్నారు. అయితే టిఆర్‌ఎస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నారాయణ అన్నారు. తనకు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని, తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుండి ఎంపిగా గెలుపొందుతానని నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+