కేసీఆర్ తప్పించుకోలేరు, ప్రభుత్వం కూలుతుంది: అచ్చెన్నాయుడు, ఇంటికి బాబు నో!
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి కేసీఆర్ తప్పించుకోలేరని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం అన్నారు. కేసీఆర్ తప్పుడు కేసులు పెట్టాలనే భ్రమలో ఉన్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
చంద్రబాబుకు నోటీసు ఇచ్చేందుకు ఏసీబీకి అధికారమే లేదన్నారు. ఆ రాష్ట్రంలో తప్పు చేస్తే ఏసీబీకి చర్య తీసుకునే అధికారం ఉందన్నారు. ఉమ్మడి రాజధానిలో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు. తెలుగు ప్రజలకు ఏసీబీకి నోటిసులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
తెలుగువారిలో అయోమయంలో ఉంచేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. శాంతిభద్రతల విషయంలో తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసీఆర్, జగన్‌లవి కుమ్మక్కు రాజకీయాలు అన్నారు.

హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వానికి ఎంత అధికారం ఉందో, తమకూ అంతే అధికారం ఉందన్నారు. కేసీఆర్‌కు ఎంత హక్కు ఉందో మాకూ అంతే ఉందన్నారు. సెక్షన్ 8 ప్రకారం హైదరాబాదులో భద్రత గవర్నర్ బాధ్యత అన్నారు. అందులో గవర్నర్ ఫెయిల్యూర్ అయ్యారన్నారు.
భద్రత గవర్నర్ చేతిలో ఉంటే తమకు ఇబ్బంది లేదని, తెరాస చేతిలో ఉంటే మాత్రం మీ లా అండ్ ఆర్డర్ మాకు అవసరం లేదన్నారు. మా పోలీసులను మేమే పెట్టుకుంటామని చెప్పారు. పిచ్చిపిచ్చి ప్రేలాపనలు వద్దన్నారు. సెక్షన్ 8కు అధికారం లేకుంటే విభజన చట్టం కూడా అంతే అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ విషయానికి చెందిన అంశంపై తాము ఆధారాలు విడుదల చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూలుతుందని చెప్పారు. ఏసీబీకి నోటీసులు ఇచ్చే అధికారమే లేదన్నారు.
కేసీఆర్ సీఎం పదవి పోగొట్టుకునే పరిస్థితి: టీడీపీ నేత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారని మరో టీడీపీ నేత అన్నారు. చంద్రబాబు పైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, తాము భయపడే ప్రసక్తి లేదన్నారు.
ఇంటికి ఎవరూ రావొద్దని చంద్రబాబు!
ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో వేడిని రాజేస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి పలు కథనాలు, ఊహాగానాలు వస్తున్నాయి. చంద్రబాబు తన నివాసానికి ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఏదైనా పనులుంటే సచివాలయానికి లేదా క్యాంప్ కార్యాలయానికి రావాలని చెబుతున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications