Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో జగన్ ఓట్ బ్యాంకు పైనే కేసీఆర్ గురి - అక్కడే అసలు ట్విస్ట్..!!

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఖాయమైంది. పార్టీ అధినేత..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ నేతలతో ఈ విషయం నిర్ధారించారు. ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగునున్నాయి. లోక్ సభ స్థానాలతో పాటుగా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలనేది బీఆర్ఎస్ లక్ష్యం. ఈ సమయంలోనే కేసీఆర్ తో ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు ఆసక్తిగా ఉన్న నేతలు సమావేశమయ్యారు.

వారికి కేసీఆర్ తన పార్టీ లక్ష్యాలను స్పష్టం చేసారు. దీంతో..బీఆర్ఎస్ ఏపీలో ఫోకస్ చేసిన ఓట్ బ్యాంకు..ఎవరితో కలిసి ముందుకు వెళ్తుందనే అంశాల పైన దాదాపుగా స్పష్టత వస్తోంది. సీఎం జగన్ నమ్ముకున్న ఓట్ బ్యాంక్ పైనే గుడి పెడుతోంది. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

ఏపీలో బీఆర్ఎస్ టార్గెట్ ఫిక్స్..

ఏపీలో బీఆర్ఎస్ టార్గెట్ ఫిక్స్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు బీజేపీకి వ్యతిరేకంగా చేసారు. బీజేపీని వ్యతిరేకించే వారిని ఒకే తాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో, బీజేపీని వ్యతిరేకించే వారికి తమ పార్టీ ఏపీలో ప్రత్యామ్నాయ వేదికగా మారుతుందనేది బీఆర్ఎస్ అధినేత అంచనగా కనిపిస్తోంది.

అదే సమయంలో తెలంగాణతో పాటుగా ఏపీకి విభజన హామీల అమలును కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. వీటిని సాధించటంలో వైసీపీ - టీడీపీ వెనుకబడ్డాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ మూడు పార్టీల్లో ఏ ఒక్కరూ కేంద్రాన్ని ఏపీ ప్రయోజనాల కోసి నిలదీయటం లేదనేది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ప్రధానంగా బీజేపీని వ్యతిరేకిస్తూ.. ఏ పార్టీకి మద్దతుగా నిలవలేని వారికి బీఆర్ఎస్ వేదిక కానుంది. ఇదే సమయంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తుకు బీఆర్ఎస్ ఏపీలోనూ సిద్దం అవుతోంది.

వైసీపీ నమ్ముకున్న ఓట్ బ్యాంకు పై గురి పెట్టిందా..

వైసీపీ నమ్ముకున్న ఓట్ బ్యాంకు పై గురి పెట్టిందా..

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను ఏపీ నేతలు కలిసారు. దాదాపుగా వారంగా బీసీ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నవారే. ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ బీసీ ఓట్ బ్యాంకును ఓన్ చేసుకొని 2024 ఎన్నికల్లో మద్దతు పొందాలని భావిస్తోంది. ఇప్పటికే బీసీ గర్జన నిర్వహించింది. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతు పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. టీడీపీకి ఈ వర్గాలను పూర్తిగా దూరం చేసే వ్యూహాలను 2019 నుంచి అమలు చేస్తున్నారు. 2019లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరింతగా వారి మద్దతు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ కూడా ఏపీలో బీసీ వర్గాల పైనే గురి పెట్టినట్లు కనిపిస్తోంది.

అదే విధంగా సహజంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే కొన్ని వర్గాలకు తాను దగ్గరయ్యే ప్రయత్నాలు ఉంటాయి. సీఎం జగన్ బీజేపీ ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉంటున్నా.. రాజకీయంగా బీజేపీతో సంబంధాలు లేవు. బీజేపీతో పొత్తులు లేవు. దీంతో, బీజేపీ వ్యతిరేకించే వర్గాలు జగన్ ను కాదని.,.కేసీఆర్ కు మద్దతిస్తారా అనేది చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీతో ఏ పార్టీకి మేలు చేస్తుందీ..ఏ పార్టీకి నష్టం చేస్తుందనే చర్చలు మొదలయ్యాయి.

వారితోనే పొత్తులు - మేలు జరిగేదెవరికి

వారితోనే పొత్తులు - మేలు జరిగేదెవరికి

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ..దక్కించుకొనే ఓట్ల పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. బీఆర్ఎస్ బీసీ, బీజేపీ వ్యతిరేక ఓట్ల పైన ఫోకస్ పెడుతోందని చెబుతున్నారు. ఆ ఓట్లు ఇప్పటి వరకు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. వైసీపీ నుంచి బీఆర్ఎస్ కు ఆ ఓట్ల బదిలీ అంత సులువు కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. కొంత మేర అయినా..అవి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానూ చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ప్రధాన ప్రతిపక్షాలకు ఆ వ్యతిరేక ఓటు వెళ్లకుండా..బీఆర్ఎస్ కు వెళ్లటం ద్వారా పరోక్షంగా వైసీపీకి మేలు జరుగుతందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక.. టీడీపీ - జనసేన అటు బీజేపీతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్న వేళ వామపక్ష పార్టీలు ఏపీలో బీఆర్ఎస్ తో కలిసే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. సంక్రాంతి తరువాత బీఆర్ఎస్ మంత్రులు ఏపీలో పర్యటించన్నారు. ఆ సమయంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ పైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+