వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపులకు రిజర్వేషన్లు, ముద్రగడ దీక్ష విరమించాలి: కెఈ

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాపుల రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు ఇచ్చిన హామీల
అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన డిప్యూటీ సీఎం రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. ఒకే స్థానం వచ్చిందని బాధపడాల్సిన అవసరంలేదని తెలిపారు.

KE appeals Mudragada to withdraw fast

భవిష్యత్‌లో గ్రేటర్‌ హైదరాబాదులో టిడిపి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఢిల్లీలోనే పరాజయం తప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇదిలావుంటే, ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రావు శనివారంనాడు కలిశారు.

ముద్రగడ పద్మనాభం డిమాండ్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాలను బొడ్డు భాస్కర రావు ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ముద్రగడ చేత దీక్ష విరమింపజేయడానికి ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని బొడ్డు భాస్కర రావు చెప్పారు.

English summary
Andhra Pradesh deputy CM KE Krishna Murthy appealed to Mudragada Padmanabham to withdraw fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X